Horoscope Today: వారు ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలాలు (అక్టోబర్ 3, 2023): మేష రాశి వారి మాటకు, చేతకు తిరుగుండదు. వృషభ రాశి వారికి రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. మిథున రాశి వారి ఆదాయంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారు ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 03rd October 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 03, 2023 | 5:05 AM

దినఫలాలు (అక్టోబర్ 3, 2023): మేష రాశి వారి మాటకు, చేతకు తిరుగుండదు. వృషభ రాశి వారికి రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. మిథున రాశి వారి ఆదాయంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శని, చంద్ర, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మీ మాటకు, చేతకు తిరుగుండదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అన్ని పనులూ సానుకూలంగా పూర్తవుతాయి. దాదాపు ప్రతి ప్రయ త్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం పరిస్థితి మెరుగ్గా, ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక గుర్తింప తెచ్చుకుంటారు. వ్యాపారాలు చాలావరకు సజావుగా సాగిపోతాయి. పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ప్రస్తుతం ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలో సంచరిస్తూండడం వల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రభుత్వపరంగా లాభం చేకూ రుతుంది. గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడానికి గానీ, అధి కారం చేపట్టడానికి గానీ అవకాశం ఉంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. కొందరు మిత్రుల సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. శుభ కార్యాలు, పుణ్య కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఈ రాశినాథుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులతో సత్పంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగి, విశ్రాంతి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు, ప్రతిభా పాటవాలు బాగా నచ్చుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశినాథుడు చంద్రుడు ఉచ్ఛలోకి వచ్చినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాభవం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వ్యాపారాల్లో లాభాలు పెరగడం ప్రారంభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకోవడం మొదలవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. స్నేహితుల పరిధి విస్తరిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

భాగ్య స్థానంలో గురువు, దశమ స్థానంలో ఉచ్ఛ చంద్రుడు, ధన స్థానంలో రాశ్యధిపతి, ధనాధిపతి బుధుడు కలవడం వంటి కారణాల వల్ల ఈ రాశివారు ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఎటువంటి ప్రయ త్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. రోజంతా ఎంతో హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సతీమణికి వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశివారికి శుభ గ్రహాలైన చంద్ర, బుధులిద్దరూ ప్రస్తుతం ఉచ్ఛ స్థానాల్లో కొనసాగుతున్నందు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో సుస్థిర స్థానం సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. వ్యాపారాలు కూడా బాగా అనుకూలంగా, ఆశాజనకంగా మారతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగు తాయి. సంస్కారవంతమైన కుటుంబంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశికి ప్రస్తుతం ఉద్యోగ స్థానాధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం, లాభస్థానంలో శుక్రుడి సంచారం, సప్తమంలో గురువు సంచారం ఎంతో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధే తప్ప తిరోభివృద్ధి ఉండదు. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశికి సప్తమ స్థానంలో భాగ్యాధిపతి చంద్రుడు ఉచ్ఛలోకి రావడం, లాభస్థానంలో రాశ్యధిపతి సంచరిస్తూ ఉండడం, లాభస్థానంలో లాభాధిపతి బుధుడు ఉచ్ఛపట్టడం వగైరాల వల్ల వృత్తి, ఉద్యో గాల్లో ప్రమోషన్ రావడం లేదా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం, తద్వారా ఆదాయం పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బందేమీ ఉండదు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అధిక భాగం గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల, అనేక ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగు పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవు తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. తోబుట్టువులు, తల్లితండ్రులు ఇంటికి వస్తారు. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు రాణిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడు, పంచమ స్థానంలో సప్తమ స్థానాధిపతి చంద్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సతీమణికి కూడా జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త ఆలోచనలు ప్రవేశపెట్టడం ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో మీ ఆలోచనలకు, ప్రాజె క్టులకు ప్రాధాన్యం పెరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

చతుర్థ స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల గృహ, వాహన సౌకర్యాలు అమరే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన సమస్యలు, ఆటంకాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో హోదా పెరుగు తుంది. వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. సతీమణికి అదృష్టం పడుతుంది. ఆధ్యా త్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రుల్ని ఆర్థికంగా ఆదుకోవడం జరుగు తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశివారికి రోజంగా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. రాశ్యధిపతి గురువు ధన స్థానంలో ఉండడం, తృతీయంలో చంద్రుడు ఉచ్ఛ, సప్తమంలో బుధుడు ఉచ్ఛ వంటి కారణాల వల్ల అను కోని అదృష్టాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో తానే కాకుండా తన సతీమణి సైతం పురోగతి చెందే అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. దీర్ఘకాలిక అనా రోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు.

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..