- Telugu News Photo Gallery Spiritual photos Lord Shiva Puja Tips : Monday Astrology Tips And Tricks in Telugu
Monday Puja Tips: సోమవారం ఈ ప్రత్యేక పరిహారాలు చేసి చూడండి.. శివుడు కోరుకున్న ఫలితాలను ఇస్తాడు.
లయకారుడు మహాదేవుడు శివయ్యను సంతోషపెట్టడం.. ఆయన అనుగ్రహం సొంతం చేసుకోవడానికీ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. నిర్మలమైన భక్తితో జనం, రెండు పువ్వులను సమర్పించిన చాలు. జ్యోతిష్య శాస్త్రంలో శివుని నుండి కోరుకున్న వరం పొందడానికి కొన్ని పరిష్కారాలు సూచించబడ్డాయి. వీటిని సోమవారం నాడు పాటిస్తే భోళాశంకరుడు త్వరగా సంతోషించి ఏ కోరికనైనా తీరుస్తాడని నమ్మకం. అంతేకాదు జీవితంలోని సమస్యలు తీరి ఉద్రిక్తతలు తగ్గడం ప్రారంభిస్తాయి. కనుక సోమవారం చేయాల్సిన పరిహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Oct 02, 2023 | 10:44 AM

ఏ దిశకు అభిముఖంగా పూజించాలంటే: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున శివుడిని ఉత్తరాభిముఖంగా పూజిస్తే శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన శివయ్య చాలా సంతోష పడతాడని.. విశ్వాసం. ఎవరైనా సరే ప్రతి సోమవారం ఉత్తరాభిముఖంగా 11, 21, 51 లేదా 108 సార్లు 'ఓం నమః శివాయ' అనే శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు.

Lord Shiva Puja

వ్యాధుల నివారణ కోసం: ఎవరైనా శారీరక వ్యాధులతో బాధపడుతుంటే సోమవారం రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. దీనితో పాటు సోమవారం నాడు శివుని 'దరిద్ర ధన శివ స్తోత్రం' పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

అనవసర భయాన్ని పోగొట్టుకోవడానికి: కారణం లేకుండా ఎవరి మనసులోనైనా భయం ఉంటే, వారు సోమవారం నాడు ఉత్తరాభిముఖంగా శివుని అనుగ్రహం కోసం ‘శివరక్షా స్తోత్రాన్ని’ పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే దీని ప్రభావం వల్ల మనిషి మనసులో ఉండే అన్ని రకాల భయాలు దూరమవుతాయి.

ఆర్ధిక సమస్యల పరిష్కారానికి: మీరు మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, సోమవారం నాడు శివుడిని పూజించండి. దీని తరువాత శివుని 'శివ్ తాండవ స్తోత్రం' పఠించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.

చంద్రుడు బలపడడానికి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే.. వారు సోమవారం చంద్రదేవుడి అనుగ్రహం కోసం 'చంద్రశేఖర స్తోత్రాన్ని' పఠించాలి, ఇలా చేయడం వల్ల చంద్రుడు బలపడతాడు. అంతే కాకుండా సోమవారమే రామాయణంలోని అయోధ్యకాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన చంద్రుడి స్థానం బలపరుడుతుంది. ఆదాయాన్ని పెంచుతుంది.




