Gandhi Temple: గాంధీలో దైవాన్ని చూస్తున్న గ్రామస్థులు.. ఏకంగా గుడి కట్టి పూజలు.. ఎక్కడంటే..

హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల్ పట్టణానికి సమీపంలోని పెద్ద కాపర్తి గ్రామంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన గాంధీ దేవాలయం. ఈ మహాత్మాగాంధీ ఆలయాన్ని సందర్శించడం చుట్టుపక్కల చాలా మందికి సెంటిమెంట్‌గా మారుతోంది. రోజు రోజుకీ గాంధీ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోందని మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పివి కృష్ణారావు చెప్పారు.

Gandhi Temple: గాంధీలో దైవాన్ని చూస్తున్న గ్రామస్థులు.. ఏకంగా గుడి కట్టి పూజలు.. ఎక్కడంటే..
Mahatma Gandhi Temple
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2023 | 11:22 AM

బ్రిటిష్ వారి నుంచి దాస్య విముక్తి కోసం.. భారతీయులకు స్వేచ్చా వాయువులను అందించడానికి ఎందరో వీరులు స్వాతంత్ర పోరాటం చేశారు. మన దేశానికి స్వేచ్ఛావాయుువులను అందించడానికి జాతిపతి మహాత్మ గాంధీ కీలక భూమిక పోషించాడు. నేడు గాంధీ జయంతి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే గాంధీ ఆలయం గురించి తెలుసుకుందాం.. ఈ గాంధీ ఆలయం తెలంగాణాలో ఉంది. అతి తక్కువమందికి తెలుసు కానీ .. రోజు రోజుకీ ఈ గాంధీ ఆలయాన్ని సందర్శించడం భక్తులకు సెంటిమెంట్ గా మారుతోంది.

హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల్ పట్టణానికి సమీపంలోని పెద్ద కాపర్తి గ్రామంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన గాంధీ దేవాలయం. ఈ మహాత్మాగాంధీ ఆలయాన్ని సందర్శించడం చుట్టుపక్కల చాలా మందికి సెంటిమెంట్‌గా మారుతోంది. రోజు రోజుకీ గాంధీ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోందని మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పివి కృష్ణారావు చెప్పారు. ఈ ఆలయాన్ని సాధారణంగా సాధారణ రోజుల్లో 60-70 మంది సందర్శకులు వచ్చే ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల తర్వాత రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతోందని రావు చెప్పారు. రోజులో దాదాపు 350 మంది భక్తులు ఇప్పుడు ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు.

ఈ గుడికి 2012లో మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమి పూజ చేయగా.. 2014, సెప్టెంబర్ 17న ఆలయంలో మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర  దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనప్పటికీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిన్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి క్రమం తప్పకుండా గాంధీ ఆలయానికి  వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేయడంతో ఆలయం నెమ్మదిగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్-విజయవాడ హైవేకి సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మహాత్ముడు కూర్చున్న భంగిమలో ప్రజలకు ఆశీస్సులు అందజేస్తున్నారు. చిట్యాల సమీపంలోని గ్రామస్తులు ఇంట ఎవరిదైనా పెళ్లి జరుగుతుంటే అప్పుడు ఆ జంటలకు పట్టు వస్త్రాలను అందించడం ఆలయ ట్రస్ట్ ప్రారంభించింది. గ్రామస్థులు వివాహ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసే ముందు పూజలు చేసి బాపు ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. చుట్టుపక్కల గ్రామస్థులు మహాత్ముడిని మహాత్ముడిగా  కాకుండా దైవత్వం నిండిన వ్యక్తిగా చూస్తారు. తెలంగాణ పర్యాటక శాఖ ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని దివ్య గమ్యస్థానాలలో ఒకటిగా చేర్చింది. ఈ ఆలయం ప్రాంగణంలో కల్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ మద్యం, మాసం తినడం నిషేధం అన్న నిబంధనలతో ఆలయ ట్రస్ట్ పెళ్లిళ్లకు అనుమతినిస్తుంది. కులాంతర వివాహాల కోసం నామమాత్రపు ధరతో కల్యాణ మండపాన్ని రెంట్ కు ఇస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్