Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. శుక్రవారంనాటి రాశిఫలాలు
దినఫలాలు (అక్టోబర్ 6, 2023): మేష రాశి వారికి ఇంటా బయటా ఆశించిన స్థాయిలో అనుకూల పరిస్థితులుంటాయి. వృషభ రాశి వారు పెళ్లి సంబంధం లేదా ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు. వారికి రావలసిన డబ్బు అందుతుంది. మే రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దినఫలాలు (అక్టోబర్ 6, 2023): మేష రాశి వారికి ఇంటా బయటా ఆశించిన స్థాయిలో అనుకూల పరిస్థితులుంటాయి. వృషభ రాశి వారు పెళ్లి సంబంధం లేదా ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు. వారికి రావలసిన డబ్బు అందుతుంది. మే రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శని, శుక్రుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయటా ఆశించిన స్థాయిలో అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలు నిదానంగా, నిలకడగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు సంపాదించే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సానుకూలపడతాయి. అవసరానికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్య క్షేత్రానికి వెడతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
శుక్ర, బుధ, రవుల సంచారం చాలావరకు అనుకూలంగా ఉన్న కారణంగా రోజంతా మీరను కున్నట్టే గడిచిపోతుంది. పెళ్లి సంబంధం లేదా ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ భారం కూడా తగ్గి ఊరట చెందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గురు, బుధ, రవుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత సమస్యల నుంచి, రుణ ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరి పోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సా హంగా ఉంటుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సంతృప్తికరంగా పరిష్కారం అవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ధన స్థానంలో చోటు చేసుకున్న బుధ, రవుల యుతి కారణంగా ఆర్థిక వ్యవహారాలు చాలావరకు కలిసి వస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి జీవితంలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు అనుకూలంగా, ఆశా జనకంగా ఉంటాయి. ఉద్యోగంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభి స్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
భాగ్య స్థానంలో గురువు, ధన స్థానంలో బుధుడు ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల మంచి లాభం అనుభవానికి వస్తుంది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో కూడా ఇతరుల బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవ హారాలు, వ్యక్తిగత పనుల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలి స్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశినాథుడు స్వక్షేత్రంలో ఉచ్ఛ పట్టి ఉన్నందువల్ల అనేక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవు తాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు లేనప్పటికీ, ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆస్తి సంబంధమైన క్రయ విక్రయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు లాభాలు పెరిగి పెట్టుబడులు పెంచుతారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మొండి బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గురు గ్రహ అనుగ్రహం బాగా ఉందిత. మీ మాటకు, చేతకు ఎదురుండదు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలను అధికారులు అనుసరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ఆహార, విహారాలకు సంబంధించి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యం సహకరిస్తుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
లాభస్థానంలో శుభ గ్రహాలు ఉండడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం కొద్దో గొప్పో పెరిగే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. ముఖ్య మైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు నత్తనడక నడుస్తాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, పంచమ స్థానంలో ఉన్న గురువు, దశమ స్థానంలో బుధ,, రవులు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. పిల్లల పరంగా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడు బలంగా ఉండడం వల్ల ఇంటి వాతావరణం ఉత్సా హంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న ప్పటికీ, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆశించిన ప్రోత్సాహకాలు అందుకోవడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. సతీమణి సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి శుభ వార్తలు వింటారు. పిల్లలు పురోగతి సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని కారణంగా స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసలు కూడా తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో మధ్య మధ్య అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలను సంతృప్తి కరంగా చక్కబెడతారు. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఏలిన్నాటి శని నడుస్తున్నప్పటికీ ధన స్థానంలో ఉన్న గురువు వల్ల జీవితం సంతృప్తికరంగా సాగి పోతుంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి.