Horoscope Today: అనూహ్యంగా అదృష్టం కలిసొస్తుంది.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దినఫలాలు (అక్టోబర్ 7, 2023): మేష రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి ధన స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల అనుకోని అదృష్టం పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దినఫలాలు (అక్టోబర్ 7, 2023): మేష రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి ధన స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల అనుకోని అదృష్టం పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శని, గురువులు, శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. వివిధ మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యేమీ ఉండకపోవచ్చు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యా ర్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
పంచమ స్థానంలో రవి, బుధులు, నాలుగవ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజు కుంటాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడ తాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యో గాలలో కలిసి వస్తుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
లాభ స్థానంలో గురు, రాహువులు, ధన స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల అనుకోని అదృష్టం పడుతుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి కాస్తంత విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల వాతావరణం అనుకూ లంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య అవకాశాలున్నాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరు గుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ధన స్థానంలో శుక్రుడు, తృతీయంలో బుధ రవుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల అనవసర వివాదాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
తొమ్మిదవ స్థానంలో గురువు, ద్వితీయ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఆర్థిక సంబంధ మైన ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులను పని తీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు సజావుగా సాగిపోతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశిలో సంచరిస్తున్న రవి, బుధులు బలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత సమస్యల్ని సమయ స్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లుఝ అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవ కాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుం టాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
సప్తమంలో గురువు, లాభ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగు తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
లాభ స్థానంలో రవి, బుధులు, దశమంలో శుక్రుడు ఉండడం వల్ల ఆదాయ వృద్ధి, కార్యసిద్ధి ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. బంధుమిత్రుల వల్ల కొన్ని కీలక పనులు సానుకూలపడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. విద్యార్థులు శ్రమ మీద కానీ విజయాలు సాధించలేరు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
శని, గురు, కుజ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అను కున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాగి పోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడు, భాగ్య స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సర్వత్రా ఆదరాభిమానాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. మిత్రుల సహాయం లభిస్తుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశికి ఏడవ స్థానంలో సంచరిస్తున్న శుక్ర గ్రహం కారణంగా రోజంతా ప్రశాంతంగా గడిచి పోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఉంటుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. నిరు ద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు ధనస్థానంలో బలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో చాలావరకు మంచి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగిపోతుంది. పిల్లల చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో డిమాండ్ బాగా పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.