Lucky Horoscope: శుభ గ్రహాలన్నీ అనుకూలం.. అరుదైన యోగంతో ఈ రాశుల వారికి అదృష్టంపట్టినట్టే..!

తొమ్మిది గ్రహాల్లో అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడమనేది చాలా అరుదు. అయితే, మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ అరుదైన యోగం పట్టబోతోంది. నెల రోజులకు పైగా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నందువల్ల వీరి అదృష్టం తప్పకుండా మారిపోతుంది.

Lucky Horoscope: శుభ గ్రహాలన్నీ అనుకూలం.. అరుదైన యోగంతో ఈ రాశుల వారికి అదృష్టంపట్టినట్టే..!
Zodiac Signs
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 16, 2024 | 3:33 PM

తొమ్మిది గ్రహాల్లో అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడమనేది చాలా అరుదు. అయితే, మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ అరుదైన యోగం పట్టబోతోంది. నెల రోజులకు పైగా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నందువల్ల వీరి అదృష్టం తప్పకుండా మారిపోతుంది. జీవితం అనేక విధాలుగా సానుకూల మలుపులు తిరుగుతుంది. గురు, శుక్ర, బుధ, శని, రవుల అనుకూలత కారణంగా వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంటుంది. ఊహించని అవకాశాలు అందివస్తాయి.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో కుజ, గురువులు, చతుర్థ స్థానంలో రవి, శుక్ర, బుధులతో పాటు లాభ స్థానంలో శని కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి మహారాజ యోగం పట్టే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయపరమైన వృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  2. మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శని, దశమంలో రాహువు, ధన, తృతీయ స్థానాల్లో శుక్ర, బుధ, రవులు సంచారం వల్ల ఉద్యోగంలో ఈ రాశివారికి మాటకు, చేతకు తిరుగుండదు. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. అనేక వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులు వృద్ధిలోకి వస్తారు. పని చేస్తున్న సంస్థకు వీరి వల్ల లాభాలు పెరుగుతాయి. అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశిలో బుధ, శుక్ర, రవుల సంచారం, లాభస్థానంలో గురువు, భాగ్య స్థానంలో రాహువు సంచా రం చేయడం వల్ల వీరికి విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతోంది. విదేశాల నుంచి నిరు ద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదు రుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ప్రముఖుడుగా చెలామణి కావడం జరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి శనీశ్వరుడితో పాటు, రాహువు, శుక్ర, బుధ, రవులు బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరికి మహా భాగ్య యోగం పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలన్నీ తీరిపోతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, హోదా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి తృతీయంలో శనీశ్వరుడు, షష్ట స్థానంలో రాశ్యధిపతి గురువు, నవమ స్థానంలో బుధ, శుక్ర, రవులు తప్పకుండా మహాయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడమే కాకుండా, ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. జీవనశైలి సమూలంగా మారిపోతుంది.
  6. మకరం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు, తృతీయంలో రాహువు, పంచమంలో గురువు, సప్తమ స్థానంలో బుధ,, శుక్రుల సంచారం విపరీత రాజయోగాన్నిస్తాయి. ఏ పని తల పెట్టినా సునాయాసంగా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కలలో కూడా ఊహించని విధంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

ఈ రాశుల వారికి అరుదైన యోగంతో అదృష్టంపట్టినట్టే..!
ఈ రాశుల వారికి అరుదైన యోగంతో అదృష్టంపట్టినట్టే..!
రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?
జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?
మరిన్ని గంటల్లో పెళ్లి..ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు..పొదల్లో
మరిన్ని గంటల్లో పెళ్లి..ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు..పొదల్లో
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
తీసుకున్న విశ్రాంతి చాలు.. సీనియర్లకు షాకిచ్చిన గంభీర్
తీసుకున్న విశ్రాంతి చాలు.. సీనియర్లకు షాకిచ్చిన గంభీర్
ఇత్తడి పాత్రలో టీ పెట్టి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా..
ఇత్తడి పాత్రలో టీ పెట్టి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా..