Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 17, 2024): మేష రాశి వారు కొద్ది ప్రయత్నంతో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. వృషభ రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. మిథున రాశి వారు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకోవడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు
Horoscope Today 17th July 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 17, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూలై 17, 2024): మేష రాశి వారు కొద్ది ప్రయత్నంతో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. వృషభ రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. మిథున రాశి వారు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకోవడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు చాలావరకు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాలను విస్తరించే ఆలోచన కూడా చేస్తారు. కొద్ది ప్రయత్నంతో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత ఇబ్బందులున్నందువల్ల ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా చిన్నా చితకా సమస్యలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. ప్రయాణాల ఆశించిన స్థాయిలో లాభిస్తాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అనుకున్నట్టు సమకూరుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలు న్నాయి. వృత్తి జీవితం కొద్దిగా బిజీ అవుతుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోవద్దు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం హుషారుగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. అనుకోకుండా వాహన యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. పనితీరుతో అధికారులను ఆకట్టుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. శ్రమాధిక్యత ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆలోచనలకు తగ్గట్టుగా వ్యవహరించడం మంచిది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారాల్లో లావాదేవీలు, కార్య కలాపాలు బాగా పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్ప డతాయి. దైవ కార్యాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులతో పాటు సహోద్యోగులు కూడా సహకరిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి ఆర్థిక సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందు తుంది. కుటుంబ సభ్యులతో చికాకులు ఉంటాయి. జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా వ్యవహ రించడం మంచిది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులుండే అవకాశం ఉంది. పని భారం పెరగడం వల్ల విశ్రాంతి కరువవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. ప్రస్తుతానికి అనవసర సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి వ్యవహా రాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబసమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో కొన్ని ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులు, కష్టనష్టాలు తప్పకపోవచ్చు. అధికారులు అతిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం వల్ల విశ్రాంతి కరువువుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ అవసరాలు పెరిగి ఇబ్బంది పడతారు. ఆదాయానికి సంబం ధించి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభి స్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ఒక ఆస్తి వివాదం నుంచి బయ టపడతారు. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ సంతృప్తికరంగా పూర్తవు తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు.