Maha Shakti Yoga: ఆ రాశుల వారికి మహా శక్తి యోగం.. పట్టుదలతో సమస్యలను జయిస్తారు..!
జ్యోతిషశాస్త్రంలో మహా శక్తి యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఏ రాశికైనా వ్యయ స్థానంలో, అంటే 12వ స్థానంలో శని, కుజ, రవి, రాహువు, కేతువు వంటి పాప గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు ఈ మహా శక్తి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం పట్టినప్పుడు సాధారణంగా ఎటు వంటి పనినైనా అవలీలగా పూర్తి చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది. ఈ యోగం పట్టినప్పుడు ఎటువంటి సమస్యనుంచయినా బయటపడగలుగుతారు.
జ్యోతిషశాస్త్రంలో మహా శక్తి యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఏ రాశికైనా వ్యయ స్థానంలో, అంటే 12వ స్థానంలో శని, కుజ, రవి, రాహువు, కేతువు వంటి పాప గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు ఈ మహా శక్తి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం పట్టినప్పుడు సాధారణంగా ఎటు వంటి పనినైనా అవలీలగా పూర్తి చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది. ఈ యోగం పట్టినప్పుడు ఎటువంటి సమస్యనుంచయినా బయటపడగలుగుతారు. ఈ యోగం పట్టినవారితో పట్టుదల, తెగువ, చొరవ బాగా పెరుగుతాయి. సమస్యల పరిష్కారం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ప్రస్తుతం మేషం, మిథునం, సింహం, తుల, మీన రాశుల వారికి ఈ యోగం పట్టింది. ఈ యోగం మరో నెల రోజుల పాటు కొనసాగుతుంది.
- మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహు సంచారం వల్ల ఈ రాశివారికి ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పడుతుంది. ఆదాయం పెంచుకోవడానికి, ఆదాయ మార్గాలను విస్తరించడానికి ప్రయత్నాలు సాగించి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలను కూడా చాలావరకు తగ్గించుకునే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గే సూచనలున్నాయి. వీరిలో సహజసిద్ధంగా ఉండే చొరవ వల్ల విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి.
- మిథునం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆర్థిక సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయి. వీరిలోని సహజసిద్ధమైన ప్రతిభాపాటవాలు, నైపుణ్యాల కారణంగా ఉద్యోగంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. గట్టి పట్టుదలతో వీరు తమ లక్ష్యాలన్నిటినీ సాధించుకుంటారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబ సమస్యలను కూడా చాలావరకు పరిష్కరించుకుంటారు.
- సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల వీరిలో శక్తియుక్తులు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ ను బాగా పెంచుకుంటారు. రాజకీయాలు, ప్రభుత్వాల వల్ల ప్రయోజనాలు పొందు తారు. ఉద్యోగంలో అధికారులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, వృత్తి, వ్యాపా రాల్లో పోటీదార్ల ఒత్తిడిని కూడా తగ్గించుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- తుల: ఈ రాశికి వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆదాయ వృద్ధికి బాగా కష్టపడడం జరుగు తుంది. అనేక లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని క్రమంగా సాధించుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వారి విదేశీ ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలి స్తాయి. ఆస్తి వివాదాలకు స్వస్తి చెబుతారు. ఆదాయ మార్గాలను విస్తరించుకుంటారు. ఆశించిన మేరకు తీర్థయాత్రలు, విహార యాత్రలను పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు.
- మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. మొండి పట్టుదలతో వీరు ప్రతిదాన్నీ సాధించుకుంటారు. ప్రతి పనీ, ప్రతి వ్యవహారమూ సానుకూలంగా పూర్తవుతుంది. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి, తమ ఆశలు, ఆశయాల్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.