Lucky Zodiac Signs: ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి అధికార యోగం పట్టనుంది.. అందులో మీ రాశి ఉందా?

నిజానికి ఈ ఐదు రాశుల వారికి రవి మీనంలో ప్రవేశించిన దగ్గర నుంచి అంటే మార్చి 16 నుంచి మే 16 వరకు శుభ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. దీని సానుకూల ప్రభావం ఏప్రిల్ నెలలో సంబంధిత రాశులకు స్పష్టంగా కనిపించే అవకాశముంది.

Lucky Zodiac Signs: ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి అధికార యోగం పట్టనుంది.. అందులో మీ రాశి ఉందా?
Zodiac SignsImage Credit source: TV9 Telugu
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 24, 2023 | 6:35 PM

ప్రస్తుతం స్వక్షేత్రాలలో ఉన్న శని, గురువులకు తోడు, రవి ఉచ్ఛ స్థానంలోకి రావడం కొన్ని రాశుల వారి జీవితాలను సానుకూల మలుపు తిప్పబోతోంది. రవి ఉచ్ఛ స్థితిలోకి రావటం వల్ల ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కుంభరాశుల వారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుండి కూడా బయటపడడం జరుగుతుంది. నిజానికి ఈ రాశుల వారికి రవి మీనంలో ప్రవేశించిన దగ్గర నుంచి అంటే మార్చి 16 నుంచి మే 16 వరకు శుభ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. దీని సానుకూల ప్రభావం ఏప్రిల్ నెలలో సంబంధిత రాశులకు స్పష్టంగా కనిపించే అవకాశముంది. ఈ రాశుల వారికి రెండు నెలలపాటు ఏ విధంగా కలసి రాబోతుందో పరిశీలిద్దాం.
మేష రాశి
రవి గ్రహం రాశి మారటం వల్ల మేష రాశి వారికి తప్పనిసరిగా అధికార యోగం పట్టే అవకాశం ఉంది. గ్రహాలకు రాజు అయినటువంటి రవిగ్రహం మేష రాశిలో ఉచ్ఛ స్థానానికి చేరుకోవడం వల్ల ఈ రాశి వారి జీవితాలలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలున్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగటం, కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడటం వంటివి జరుగుతాయి. సంతానం పురోగతి సాధిస్తుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఈ రాశి వారి సలహాలు, సూచనలు అధికారులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ రాశి వారు కొత్త ప్రయత్నాలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
మిథున రాశి
ఈ రాశి వారికి లాభ స్థానంలో రవి సంచరించడం వల్ల ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా పురోగతి చెందడానికి మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల ఆదాయం పెరగటం, లాభాలు రెట్టింపు కావడం వంటివి జరుగుతాయి. వీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ వీరి పురో గతి వేగం పుంజుకుంటుంది. జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. దూరప్రాంతం నుంచి శుభ వార్తలు వింటారు. అనారోగ్యం నుంచి అతివేగంగా కోలుకునే అవకాశం ఉంది. తోబుట్టువులతో అనుబంధం పటిష్టం అవుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు.
కర్కాటక రాశి
ఈ రాశికి దశమ స్థానంలో రవి ప్రవేశిస్తున్నందు వల్ల ఉద్యోగ పరంగా ముఖ్యంగా కెరీర్ పరంగా వీరి జీవితం గొప్ప మలుపు తిరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం చేపట్టే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. రాజకీయ ప్రవేశానికి కూడా అవకాశం ఉంది. బంధు వర్గంలో వీరి మాట చెల్లుబాటు అవు తుంది. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో విశేషమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా అది ఎక్కువగా ప్రయా ణాలు చేయవలసి వస్తుంది. యాక్టివిటీ పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
సింహ రాశి 
ఈ రాశికి అధిపతి అయిన రవి నవమ రాశిలో ప్రవేశించడం అనేది శుభ యోగాలకు దోహదం చేస్తుంది. విదేశీ యానానికి, విదేశీ చదువులకు, విదేశాలలో స్థిరపడటానికి, విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి ఎదురుచూస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వీసా సమస్యలు ఏవైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వారసత్వ సంపద చేతికి అందుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కుంభ రాశి
ఈ రాశి వారికి మూడవ స్థానమైన మేషరాశిలోకి రవి ప్రవేశించడం ఊహించని అదృష్టాలను తెచ్చి పెడుతుంది. వీరు ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం మొదలుపెట్టినా అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. తోబుట్టువులతో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. కనిష్ట సోదరులకు అండగా నిలబడటం జరుగుతుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. మిత్రులకు వీలైనం తగా సహాయపడటంతో పాటు, వారి అభివృద్ధికి చేయూతనివ్వడం జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం కావడం, మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరటం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి.
అనుసరించాల్సిన విధులు..
ఈ రాశుల వారికి రవి గ్రహం పూర్తి స్థాయిలో అనుగ్రహించి వేగంగా సత్ఫలితాలను ఇవ్వడానికి ఒకటి రెండు సూచనలను అనుసరించడం మంచిది. మొదటగా, ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పఠించడం వల్ల అత్యుత్తమ ఫలితా లను పొందవచ్చు. ప్రతి నిత్యం సూర్యనారాయణ స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది. అంతేకాక, ఆదివారం నాడు ఒక పూట మాత్రమే భోజనం చేసి రెండవ పూట ఉపవాసం ఉండటం వల్ల కూడా శుభ ఫలితాలు త్వరగా అనుభవానికి వస్తాయి.
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..