Horoscope Today (March 25, 2023): ఆ రాశికి చెందిన వ్యాపారులకు ఆర్థిక లాభాలు.. 12 రాశులవారికి రాశిఫలాలు ఇలా..

Daily Horoscope (25 march 2023): తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. 12 రాశుల వారికి శనివారం (మార్చి 25) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today (March 25, 2023): ఆ రాశికి చెందిన వ్యాపారులకు ఆర్థిక లాభాలు.. 12 రాశులవారికి రాశిఫలాలు ఇలా..
Horoscope Today (March 25, 2023)Image Credit source: TV9 Telugu
Follow us

| Edited By: Venkata Chari

Updated on: Mar 25, 2023 | 2:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఇల్లు గానీ, ఫ్లాట్ గానీ కొనే ఆలోచన చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన బలపడుతుంది. ఉద్యోగంలో  సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వాగ్దానాలు, హామీలకు ఇది సమయం కాదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆస్తి కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్య ఒక దానికి ముగింపు పలుకుతారు. దగ్గర బంధువుల్లో ఒకరిద్దరికి ఆర్థికంగా సహాయపడతారు. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఐటి నిపుణులకు ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ పనులన్నీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అదనపు లక్ష్యాలను అప్పగిస్తారు. వ్యాపారంలో బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి దానంతట అదే పరిష్కారం అవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి వ్యాపారాల లోను, ఉద్యోగంలోనూ మీ సలహాలు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగు పడుతుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. పాజిటివ్ గా ఆలోచించడం మంచిది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం అవసరం. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారాల్సి వస్తుంది. సొంత ఇల్లు ఉన్నవారు కొత్త ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రుణ సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కొద్దిగా మెరుగ్గానే ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యాపారంలో భాగస్తులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికపరంగా సమయం అనుకూలంగా ఉంది. ఐటి నిపుణులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిపాటి మెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం. శరీరానికి తగినంత విశ్రాంతి తప్పనిసరి. శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రోజు అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు పాటిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రుణ సమస్య తగ్గుముఖం పడుతుంది. బంధువులకు అండగా నిలబడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు తొందరపాటు మంచిది కాదు. కొన్ని విషయాలలో తప్పనిసరిగా ఓర్పు, సహనాలు అవసరం. దాంపత్య జీవితంలో పొరపచ్చాలు తలెత్తుతాయి. వ్యాపారులకు ఆర్థికంగా కొద్దిగా బాగుంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ పరంగా ఒక చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. భారీగా ఇంక్రిమెంట్ పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రధానమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధు వర్గంలో పలుకుబడి పెరుగుతుంది. మీ వల్ల మిత్రులు కొందరు లబ్ధి పొందుతారు. సహచరులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. మిత్రుల సహాయంతో  ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల కారణంగా ఆస్తి సమస్య ఒకటి ఒక కొ లిక్కి వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. వాగ్దానాలకు హామీలకు ఇది సరైన సమయం కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీల వల్ల ఇప్పుడు మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. షేర్లు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో కొద్దిగా పని భారం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు బాగా బిజీ అయిపోతారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఉద్యోగపరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, డీలర్ షిప్ వంటి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు కొద్దిగా ఉపశమనం పొందే అవకాశం ఉంది.

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..