Rashi Phalalu: వారికి ఆదాయానికి మించి ఖర్చులు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today (November 14, 2025): మేష రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మిథున రాశి నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (నవంబర్ 14, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగమిస్తాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఊహించని వస్తు లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు గతం కంటే బాగా అనుకూలంగా ఉంటాయి. గృహ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఘన విజ యాలు సాధించడం జరుగుతుంది. కొందరు స్నేహితులకు బాగా సహాయం చేస్తారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కివస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ వాతావరణం సామరస్యంగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. బంధువర్గం నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము అవసర సమయంలో అందుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఒక రిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగాలు చాలావరకు ప్రోత్సాహకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇష్టమైన మిత్రులతో సర దాగా గడుపుతారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిళ్లు, సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. కొందరు బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తొలగిపోయే అవకాశముంది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ): ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పరవాలేదనిపిస్తాయి. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ఇంట్లో సౌకర్యాల మెరుగుదల మీద దృష్టి పెడ తారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయానికి లోటుండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల ఉంటుంది. ఇంటా బయటా శ్రమ తప్పకపోవచ్చు. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆస్తి వివాదాలు, సమస్యలు చక్కబడే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయ మార్గాలు నిలకడగా సాగుతాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యో గం లభించే సూచనలున్నాయి. ఆదాయం బాగా మెరుగ్గా ఉంటుంది. తోబుట్టువులతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.



