- Telugu News Photo Gallery Spiritual photos Lucky Zodiac Signs: Planetary Alignment Brings Income and Success for 6 Zodiacs
కీలక గ్రహాల అనుకూలత.. ఈ ఏడాది చివరి వరకు వీరికి అన్నింటా విజయమే..!
Lucky Zodiac Signs: ఈ వారంలో గురు, శుక్రులతో పాటు కుజ, బుధ, రవులు కూడా అనుకూలంగా మారుతున్నందు వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వీరి విజయాలు, సాఫల్యాలతో సాగిపోతాయి. కర్కాటకం, తుల, వృశ్చిక రాశుల్లో ఉన్న ఈ గ్రహాలకు బలం బాగా పెరుగుతున్నందువల్ల మేషం. కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశులు ఇప్పటి నుంచి ఈ ఏడాదంతా అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నాయి. ఈ రాశుల వారు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత మంచిది. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు, విదేశీయానాలు, ఆస్తి లాభాలు వంటివి తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది.
Updated on: Nov 14, 2025 | 12:55 PM

మేషం: ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడితో పాటు గురు, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం తలుపు తట్టబోతోంది. కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

కర్కాటకం: ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్రులతో పాటు కుజ, బుధ, రవులు కూడా బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన కోరికలన్నీ నెరవేరుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఆశించిన పదో న్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.

తుల: ఈ రాశికి ప్రస్తుతం బుధ, శుక్రులతో పాటు శని, కుజ, రవుల అనుకూలత కూడా పెరుగుతున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీత భత్యాలు కూడా బాగా పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వృశ్చికం: ఈ రాశికి గురు, రాహువులతో పాటు శుక్ర, కుజ బుధులు బాగా అనుకూలంగా మారుతున్నందు వల్ల లాభదాయక వ్యవహారాలు, కార్యక్రమాలు చేపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి అంచనాలకు మించి లాభం పొందుతారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

మకరం: ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్ర, రవి, కుజ, బుధులు ముగ్గురూ బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అతి కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం: ఈ రాశికి శుక్ర, కుజ, బుధ, రవి గ్రహాల అనుకూలత పెరిగినందువల్ల అనేక విధాలుగా అపార ధన లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.



