- Telugu News Photo Gallery Spiritual photos According to astrology, why should financial transactions not be made on Tuesday?
మంగళవారం అప్పు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదంటారు? ఎందుకు?
మంగళవారం వచ్చిందంటే చాలు చాలా మంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా, తీసుకోవడం అస్సలే చేయరు. మరి అసలు వారంలో మంగళ వారం రోజు మాత్రమే ఎందుకు అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు అంటారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Nov 14, 2025 | 4:39 PM

మంగళ వారం ఆంజనేయ స్వామికి సంబంధించినది. అంతే కాకుండా మంగళ వారం అంగారక గ్రహానికి అంకితం చేయడంజరిగిందంట. అందువలన ఈ రోజు అప్పు తీసుకుంటే దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందంట. అందుకే ఈ రోజు అప్పు ఇవ్వడం కానీ , తీసుకోవడం కానీ చేయకూడదని చెబుతున్నారు పండితులు.

అంగారక గ్రహం, సూర్యడికి అతి దగ్గరిలో ఉండే గ్రహం. అయితే ఇది ఎప్పుడూ మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువలన మంగళ వారం రోజున అప్పు తీసుకుంటే అది అంగారక గ్రహంలా అగ్నిలా పెరుగుతుందంట. దీనిని తిరిగి చెల్లించడం కష్టం అవుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదంట.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళ వారం రోజున ఎవరైతే రుణం తీసుకుంటారో, వారు దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందంట. అంతే కాకుండా, ఆ రుణం కూడా వేగంగా పెరుగుతుంది. రోజు రోజుకు మిమ్మల్ని ఆర్థిక సమస్యల్లో నెట్టి వేస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అలాగే, మంగళ వారం రోజున అప్పు తీసుకోవడం వలన ఆ వ్యక్తి రుణ చక్రంలో చిక్కుకోని, చాలా సమస్యలు కొని తెచ్చుకుంటాడంట.

మంగళ వారం రోజున రుణం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా అస్సలే మంచిది కాదంట. ఈ రోజు ఇచ్చిన రుణం తిరిగి రాదు అని చెబుతారు పండితులు. అంతే కాకుండా ఈ రోజు ఎవరైనా రుణం ఇస్తే దానిని తీసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందుకే రుణం ఇవ్వడం కానీ, రుణం తీసుకోవడం కానీ అస్సలే చేయకూడదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

మంగళ వారం ఎలాంటి పనులు చేయడానికి మంచిదంటే? ఈ రోజున తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి లేదా మీరు తీసుకున్న రుణం మొదటి విడత చెల్లించడం చాలా శుభ ప్రదం. అలాగే మంగళవారం రోజున ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి సుందరకాండ పఠించడం, హనుమంతుడిని పూజించడం చాలా మంచిది.



