AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలకాలం కలిసి ఉండాలంటే.. భర్తకు భార్య చెప్పకూడని విషయాలివే!

వివాహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ముళ్లతో, ఏడు అడుగులతో మొదలై.. నిండు నూరేళ్లు కొనసాగుతూ ఉంటుంది. ఇక భార్య భర్తలు ప్రతీ విషయాన్ని ఒకరికి ఒకరు పంచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు అస్సలే భార్య భర్తకు చెప్పకూడదంట. కాగా, అసలు భార్య భర్తకు ఎలాంటి విషయాలు చెప్పకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 14, 2025 | 6:02 PM

Share
భార్య భర్తల బంధం బాగుండాలి అంటే ఎప్పుడూ కూడా భార్య కొన్ని విషయాలను భర్తతో పంచుకోకూడదంట. ముఖ్యంగా కొన్ని విషయాలను భార్య భర్తకు పదేపదే భర్తకు చెప్పకూడదంట.  అయితే ఏ విషయాలు భార్యలు భర్తల వద్ద దాచాలి. ఎలాంటి విషయాల్లో మహిళలు జాగ్రత్తగా ఉంటే వైవాహిక  బంధం బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
భార్య ఎప్పుడూ కూడా తమ ఆర్థిక పరిస్థితి, ఇంటి సమస్యల గురించి భర్తతో పంచుకోకూడదంట. ఈ విషయాలను పదే పదే భర్తతో పంచుకోవడం వలన ఇద్దరి మధ్య గొడవలు పెరిగి, బంధంలో చీలికలు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

2 / 5
అలాగే భార్య ఎప్పుడూ కూడా భర్త వద్ద అబద్ధం చెప్పకూడదంట. భర్త వద్ద పదే పదే అబద్ధం చెప్పడం వలన భార్యపై భర్తకు ఉండే నమ్మకం పోతుంది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, చివరకు ఇద్దరు విడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదంట. అందుకే భార్య భర్తకు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదంట.

3 / 5
భార్య భర్తలు మనీ విషయంలో చాలా జాగ్రత్తగా మెదలాలి. అలాగే ఎప్పుడూ కూడా భార్య తన పొదుపుల గురించి భర్తకు చెప్పకూడదంట. తన పొదుపు గురించి, భర్తకు చెప్పడం వలన ఇంటిలో ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయంట. అందుకే ఎప్పుడు కూడా భర్తకు భార్య పొదుపుల విషయాలను తెలియనివ్వకూడదు.

4 / 5
భార్య ఎప్పుడూ తన భర్తను మరెవరితోనూ పోల్చకూడదు. తన భర్త ఆదాయం, జీవనశైలి లేదా విజయాలను ప్రస్తావించడం వైవాహిక బంధానికి చాలా హానికరం అంట. అందుకే భర్తను ఎప్పుడూ కూడా వేరొకరితో పోల్చ కూడదు అని చెబుతున్నారు పండితులు.  (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5