AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: విజయదశమి రోజున వీరికి శుభ ఘడియలు.. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈ రాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో నెరవేరుతాయి. ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందుతారు.

Horoscope Today: విజయదశమి రోజున వీరికి శుభ ఘడియలు.. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
Basha Shek
|

Updated on: Oct 05, 2022 | 5:06 AM

Share

మేషం

ఈరాశి వారు చేపట్టిన పనులు పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో సమయస్ఫూర్తి, ముందుచూపుతో వ్యవహరించాలి. ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా మారుతారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మరీ మంచిది.

వృషభం

విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని బాధ్యతలు భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వర్తించి సమాజంలో అందరి ప్రశంసలు పొందుతారు. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.

మిథునం

ఈరాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని వ్యవహరాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనసుకు బాధ కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. సూర్య భగవానుడిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల వారు సానుకూల ఫలితాలు పొందుతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురువుతాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త మనసుకు ఎంతో బాధ కలిగిస్తుంది. శివుడిని పూజిస్తే మంచిది.

సింహం

ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఉద్యోగులకు స్థానభ్రంశం కలిగే సూచనలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో ముందుకెళతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

కన్య

కీలక విషయాలు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతాయి. శని ధ్యాన శ్లోకం చదువుకోవాలి. ఇష్టదైవారాధన మాత్రం మరవద్దు.

తుల

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన మనసుకు బాధ కలిగిస్తుంది. గోసేవ చేస్తేమంచిది.

వృశ్చికం

ఈ రాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో నెరవేరుతాయి. ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందుతారు.

ధనస్సు

వీరు శుభకార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం మేలు చేకూరుస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.ఇష్ట దేవతలను ప్రార్థించడం వల్ల శుభం కలుగుతుంది.

మకరం

కీలక నిర్ణయాల్లో పెద్దల సహకారం తీసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవ సందర్శనంతో మేలు చేకూరుతుంది.

కుంభం

కొన్ని విషయాల్లో సమయస్ఫూర్తి, ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. కొన్ని ఇక్కట్లు ఎదురువుతాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మరీ మంచిది.

మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూల ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందులు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవారాధన మానవద్దు.

NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి