Horoscope Today: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే.. ధనలాభం ఉంటుంది.. గురువారం రాశి ఫలాలు..
ఈరోజు వీరికి సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు.
మేష రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. రుణబాధలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు.
వృషభ రాశి.. ఈరోజు వీరికి కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
మిథున రాశి.. ఈరోజు వీరికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటక రాశి.. ఈరోజు వీరికి కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు.
సింహ రాశి.. ఈరోజు వీరు ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్థాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
కన్య రాశి.. ఈరోజు వీరికి ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది.
తుల రాశి.. ఈ రోజు వీరు రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు.
ధనుస్సు రాశి.. వీరికి ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు.
మకర రాశి.. వీరు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు.
కుంభరాశి.. ఈ రోజు రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మీన రాశి.. ఈరోజు వీరికి కస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది.
నోట్: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..