AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారు ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 3, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. వృషభ రాశి వారు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారు ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 03 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 3, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడే అవకాశముంది. వృషభ రాశి వారు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయక వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాల నిస్తాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో, ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం మరింతగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వస్త్రాభరణాలు కానీ, విలువైన వస్తువులను కానీ కొనే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. మరింత మంచి సంస్థలోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు ఒక పట్టాన పూర్తి కాకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శించడానికి అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశముంది. వృత్తి జీవితంలో కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రాబడికి ఏమాత్రం లోటుండదు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. డాక్టర్లకు, లాయర్లకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంతగా దూరంగా ఉండడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లవలసి రావచ్చు. వ్యాపార జీవితంలో శుభ పరిణామాలకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో అనుకూలతలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాల్లో కూడా ఆర్థిక పురోగతి ఉంటుంది. కుటుంబంలో చాలావరకు అను కూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పనిభారం ఉన్నా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. దగ్గర బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల తీవ్రత తగ్గుతుంది. అనారోగ్య సమస్య నుంచి కొంత వరకు బయటపడతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారంలో కీలక మార్పులు చేపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలపై దృష్టి పెడతారు. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ఇంటా బయటా ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్త అవసరం. ఒకరిద్దరు బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాలకు రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. వ్యక్తి గత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధార పడే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబసమేతంగా ఆలయాల దర్శనం చేసుకుంటారు. కొద్దిగా అనారోగ్య సమస్యలుంటాయి.