AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల తగ్గింపు!

Donald Trump: వాణిజ్యం సహా అనేక అంశాలపై ప్రధాని మోదీ, ట్రంప్ చర్చించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, "ప్రధాని మోదీ నా ప్రాణ స్నేహితులలో ఒకరు. ఆయన దేశానికి శక్తివంతమైన, గౌరవనీయ నాయకుడు. వాణిజ్యం, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడం వంటి అనేక అంశాలపై మేము చర్చించాము" అని అన్నారు.

Donald Trump: దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల తగ్గింపు!
Trump - Modi
Subhash Goud
|

Updated on: Feb 02, 2026 | 11:13 PM

Share

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను 25% నుండి 18%కు తగ్గించారు. ఇప్పుడు భారతదేశం-అమెరికా మధ్య సుంకం కేవలం 18% వద్దనే ఉంటుంది. అయితే కాలక్రమేణా సుంకాల రేట్లు మరింత తగ్గుతాయి. ఈ అంశంపై ట్రంప్ – ప్రధాని మోడీ ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చారు. సుంకాన్ని 18% నుండి సున్నాకి తగ్గించడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు టారీఫ్‌ల తగ్గింపుపై ట్రూత్‌లో ట్రంప్‌ పోస్టు చేశారు.

వాణిజ్యం సహా అనేక అంశాలపై ప్రధాని మోదీ, ట్రంప్ చర్చించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, “ప్రధాని మోదీ నా ప్రాణ స్నేహితులలో ఒకరు అంటూ కొనియాడారు. అలాగే ఆయన దేశానికి శక్తివంతమైన, గౌరవనీయ నాయకుడు. వాణిజ్యం, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడం వంటి అనేక అంశాలపై మేము చర్చించాము” అని ట్రంప్ అన్నారు.

భారత్ ఇకపై రష్యా నుంచి కాదు, వెనిజులా నుంచి చమురు కొనుగోలు: ట్రంప్

రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ ఇంకా ప్రకటించారు. అమెరికా, వెనిజులా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో సుంకాలు మరింత తగ్గుతాయని చెప్పారు. తగ్గించిన సుంకాలు వెంటనే అమల్లోకి వస్తాయి. భవిష్యత్తులో భారత్‌తో మా సంబంధం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ, నేను పనులు పూర్తి చేసే ఇద్దరు వ్యక్తులం అని వ్యాఖ్యానించారు.

భారతదేశం- అమెరికా మధ్య జరిగిన కొత్త ఒప్పందం ప్రకారం.. అమెరికా భారతదేశంపై సుంకాలను తగ్గించింది. ట్రంప్ వాదనల ప్రకారం, భారతదేశం రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేయడానికి, అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులను పెంచడానికి అంగీకరించింది. అమెరికా పప్పుధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తులపై ఇటీవల విధించిన సుంకాలను ఉపసంహరించుకుంటామని కూడా భారతదేశం సూచించింది

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్