మేడమ్ ఇది మీరేనా.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ స్టన్నింగ్స్ లుక్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

12  July 2026

సినీ పరిశ్రమలో హీరోయిన్లు దశాబ్దాలు గడుస్తున్నా తమ క్రేజ్, అందాన్ని కాపాడుకుంటూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంటారు.

ఈ కోవలోకే వస్తారు అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్. 90వ దశకంలో తన నటన, అద్భుతమైన గ్లామర్, డ్యాన్స్‌లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సిమ్రాన్ వయసు 50 సంవత్సరాలు.

కానీ తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. సిమ్రాన్ లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఈ ఫోటోలలో ఆమె ఒక స్టైలిష్ వెరైటీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి ఎంతో హుషారుగా, అల్లరిగా ఫోజులిచ్చారు. ఈ లుక్ చూసిన నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

 50 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యువతిలా కనిపిస్తున్నారు.. మీ అందం అస్సలు చెక్కుచెదరలేదు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

1995లో బాలీవుడ్ సినిమా 'సనమ్ హరిజాయ్'తో కెరీర్ ప్రారంభించిన సిమ్రాన్, 1997లో 'అబ్బాయి గారి పెళ్లి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

ఆ తర్వాత సమరసింహారెడ్డి, కలిసుందాం రా, నరసింహనాయుడు, నువ్వు వస్తావని వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో అగ్ర కథానాయికగా వెలిగారు.