AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rates: పీఛేముడ్ కొట్టిన గోల్డ్, సిల్వర్ ధరలు.. 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా…?

బంగారం, వెండి ధరలు పీఛేముడ్ కొట్టేశాయి. కన్‌జ్యూమర్లకు మళ్లీ మెంటలెక్కిస్తున్నాయి. నాలుగురోజుల ముందున్న వెండి ధరకు ఇవాళున్న ధర దాదాపు సగం. అంటే.. వందశాతం పెరిగినట్టే పెరిగి.. అదే వంద శాతం గోడక్కొట్టిన బంతిలాగే మళ్లీ వెనక్కొచ్చింది. పుత్తడిది కూడా అదే దారి. యూటర్న్ కొట్టిన పసిడి ధరలు మరో వారం రోజుల్లో ఎక్కడికొచ్చి ఆగుతాయి? బులియన్ మార్కెట్ ఎనలిస్టులు ఏమంటున్నారు?

Gold Silver Rates: పీఛేముడ్ కొట్టిన గోల్డ్, సిల్వర్ ధరలు.. 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా...?
Gold and Silver
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2026 | 10:22 PM

Share

బంగారం లక్షా 80 వేలు దాటిందని, వెండి 4 లక్షల మార్క్ టచ్ చేసిందని గతవారంలో అవాక్కయ్యాం కదా.. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది. గత గురువారం లక్షా 90 వేలు పలికింది పదిగ్రాముల బంగారం ధర. ఇదే ఆల్‌టైమ్ రికార్డ్. నాలుగైదు రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి, దాదాపు 40 వేలు కరెక్షన్ తీసుకుని లక్షా 50 వేల దగ్గర ఆగింది. ఇదే రకంగా వెనకెనక్కు నడిస్తే వారంరోజుల్లో లక్షకు చేరుకున్నా ఆశ్చర్యం లేదట. మొన్నటిదాకా రెండు లక్షల దిశగా ఎగబాకిన బంగారం ధర… మళ్లీ లక్షకు దిగొస్తుందా అన్న జోస్యాలు నిజమయ్యేలా ఉన్నాయి.

మరో ప్రీషియస్ మెటల్ వెండిది కూడా అదే దారి. గత వారంలో 4 లక్షల 20 వేలను టచ్ చేసిన వెండి, నాలుగేనాలుగు రోజుల్లో 40 శాతం డౌన్‌ఫాల్ చూసింది. దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో కిలో వెండి ధర 2 లక్షల 27 వేల దగ్గర కదులుతోంది. అంటే, వారం రోజుల్లో సగానికి సగం పడిపోయింది.

పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం తర్వాత బంగారం, వెండి ధరలు మరీ క్షీణించడం మొదలైంది. డాలర్‌ విలువతో పాటు, ట్రెజరీ బాండ్లపై రాబడి పెరగడం.. ఇన్వెస్టర్లు లాభాలకు అలవాటు పడ్డంతో ధరలు దారుణంగా క్షీణిస్తున్నాయి. మొన్నటిదాకా కాసుల వర్షం కురిపించిన సిల్వర్‌ ETFలు.. ఇప్పుడు నేలచూపులు చూడ్డంతో ఇన్వెస్టర్లకు సినిమా కనిపిస్తోంది.

ఇప్పుడున్న ట్రెండును చూసి, మళ్లీ 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా అని బెంబేలెత్తిపోతున్నారు మార్కెటీర్లు. ఎందుకంటే, అప్పట్లో ఒకే ఏడాదిలో నాలుగైదింతలు పెరిగిన బంగారం ధర.. మళ్లీ సాధారణ స్థితికి చేరుకోడానికి 26 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా నెలల గ్యాప్‌లోనే వరుసగా లాంగ్‌జంపులు కొట్టి రెండుమూడింతలు పెరిగిన బంగారం-వెండి ధరలు.. మళ్లీ తేరుకుని సెట్‌రైట్ కావడానికి ఎన్నేళ్లు పడుతుంతో అంచనాలకు అందడం లేదు.

ఇరాన్‌తో డీల్‌ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ఊరించడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌ను మారుస్తారన్న వార్తలు రావడం.. డాలర్ విలువ బలపడ్డం… ఇవన్నీ ఇన్వెస్టర్లలో భయాల్ని పెంచుతోంది. అందుకే, భారీ స్థాయిలో కరెక్షన్ తీసుకుందట పుత్తడి ధర. నెగిటివ్ సెంటిమెంట్ ఇదేవిధంగా కొనసాగితే బంగారం, వెండి ధరలు ఇంకాఇంకా కిందికి చూస్తే… ట్రెడిషనల్ ఇన్వెస్టర్‌ది అథోగతే మరి.

Follow Us
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
అరచేతి ‘V’ ఆకారం.. మీరు ఎప్పుడు ధనవంతులవుతారో తెలుసుకోండి
అరచేతి ‘V’ ఆకారం.. మీరు ఎప్పుడు ధనవంతులవుతారో తెలుసుకోండి
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం
కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే
కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే
మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్..ఆ 5భారీ రికార్డులపైనే అందరి కళ్లు
మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్..ఆ 5భారీ రికార్డులపైనే అందరి కళ్లు
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు
తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..
తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..
ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..