AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

zodiac signs: నవపంచమ రాజయోగంతో ఈ రాశులవారికి అసాధారణ శుభాలు.. మీ రాశి ఉందా..?

Navapanchama Raja Yoga: అసుర గురువు శుక్రుడు ఫిబ్రవరి 6, 2026న కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో దేవ గురువు బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ రెండు గ్రహాలు పరస్పరం ఐదవ – తొమ్మిదవ స్థానాల్లో ఉండటం వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అసాధారణమైన శుభ ఫలితాలు కలుగుతాయి.

zodiac signs: నవపంచమ రాజయోగంతో ఈ రాశులవారికి అసాధారణ శుభాలు.. మీ రాశి ఉందా..?
Navapanchami Rajayogam
Rajashekher G
|

Updated on: Feb 02, 2026 | 1:01 PM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా మార్చుకుంటున్న సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇలాంటి అరుదైన శుభయోగం ఏర్పడబోతోంది. దేవ గురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రుడు తమ గోచార ప్రభావంతో నవపంచమ రాజయోగాన్ని సృష్టించనున్నారు. ఈ ప్రత్యేక యోగం కారణంగా ఐదు రాశుల వారికి అదృష్టం తలుపులు తట్టబోతోందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆకస్మిక సంపద, వృత్తి పరమైన లాభాలు, జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది.

శుక్ర గోచారం – నవపంచమ యోగం ఏర్పడే విధానం

అసుర గురువు శుక్రుడు ఫిబ్రవరి 6, 2026న కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో దేవ గురువు బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ రెండు గ్రహాలు పరస్పరం ఐదవ – తొమ్మిదవ స్థానాల్లో ఉండటం వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య ప్రకారం ఐదవ ఇల్లు.. జ్ఞానం, ప్రేమ, సంతానం, సృజనాత్మకత, తొమ్మిదవ ఇల్లు.. అదృష్టం, ధర్మం, ఆధ్యాత్మికత సూచిస్తాయి. ఈ రెండింటి కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అసాధారణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

సింహ రాశి

సింహ రాశి వారి సామాజిక గౌరవం, ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందుతుంది. ఆర్థికంగా బలపడతారు. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి

మిథున రాశి

మిథున రాశి వారికి బుద్ధి, జ్ఞానం మరింత పదును పెరుగుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుదల, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం అనుకూలంగా మారుతుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ నవపంచమ రాజయోగం సర్వతోముఖ విజయాలను అందించనుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గణనీయమైన లాభాలు పొందుతారు. ఆర్థిక స్థితి గతంతో పోలిస్తే బలంగా మారుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మేష రాశి

మేష రాశి వారికి ఈ రాజయోగం కేరీర్ పరంగా గొప్ప అవకాశాలు తీసుకురానుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గత ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. రాజయోగ ప్రభావంతో స్థిరత్వం పెరుగుతుంది.

తులా రాశి

తుల రాశి వారు సానుకూల శక్తిని అనుభవిస్తారు. విద్యార్థులకు విద్యా రంగంలో విజయం లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. అదృష్టం బలంగా సహకరిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలున్నాయి. మొత్తానికి, శుక్ర – బృహస్పతి నవపంచమ రాజయోగం 2026లో ఈ ఐదు రాశుల జీవితాల్లో కీలక మలుపు తిప్పబోతోంది. అదృష్టం, సంపద, విజయం తీసుకురానుంది.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)