AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Sweet Home Expo in Vizag: అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..

TV9 Sweet Home Expo in Visakhapatnam: వైజాగ్‌లో ఇళ్ల కొనుగోలు, ప్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వైజాగ్ ఒక సరైన గమ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని ఈ అభివృద్ధి అవకాశాలను ప్రజలకు దగ్గర చేసే ఉద్దేశంతో TV9 ఆధ్వర్యంలో ‘Sweet Home Expo’ నిర్వహించనున్నారు.

TV9 Sweet Home Expo in Vizag: అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..
TV9 Sweet Home
Shaik Madar Saheb
|

Updated on: Feb 02, 2026 | 12:39 PM

Share

విశాఖపట్టణం (వైజాగ్) ఇప్పుడు కేవలం పర్యాటక నగరంగా మాత్రమే కాకుండా, దేశంలో వేగంగా ఎదుగుతున్న పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు, కార్పొరేట్ పెట్టుబడులతో వైజాగ్ అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెడుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో వైజాగ్ గ్లోబల్ కనెక్టివిటీ మరింత బలపడుతోంది. మరోవైపు పోర్ట్ ఆధారిత అభివృద్ధి, లాజిస్టిక్స్ హబ్‌లు, రహదారి విస్తరణలు నగర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అదానీ, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థల పెట్టుబడులు వైజాగ్‌పై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.

పర్యాటక రంగంలోనూ వైజాగ్ కొత్త ఆకర్షణలతో ముందుకు సాగుతోంది. కైలాసగిరి రోప్‌వే, బీచ్ టూరిజం అభివృద్ధి, స్కై సైక్లింగ్ వంటి ప్రాజెక్టులు నగర జీవనశైలిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఈ అభివృద్ధి అంతా రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త అవకాశాలను తెస్తోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఇళ్ల కొనుగోలు, ప్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వైజాగ్ ఒక సరైన గమ్యంగా మారుతోంది.

TV9 Sweet Home Expo – రియల్ ఎస్టేట్ అవకాశాలకు వేదిక

వైజాగ్‌లోని ఈ అభివృద్ధి అవకాశాలను ప్రజలకు దగ్గర చేసే ఉద్దేశంతో TV9 ఆధ్వర్యంలో ‘Sweet Home Expo’ నిర్వహించనున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బిల్డర్లు, పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారులను ఒకే వేదికపై కలిపే ఈ ఎక్స్‌పో విశాఖపట్టణం డా. ఎన్‌టీఆర్ బీచ్ రోడ్ లో హోటల్ నోవోటెల్ లో ఫిబ్రవరి 21–22, తేదీల్లో జరగనుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ తాజా ప్రాజెక్టులు, పెట్టుబడి అవకాశాలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నాయి. ఇళ్ల కొనుగోలు నుంచి పెట్టుబడి ప్లాట్లు, కమర్షియల్ ప్రాజెక్టుల వరకు విస్తృతమైన ఎంపికలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయి.

Tv9 Sweet Home

Tv9 Sweet Home

రియల్ ఎస్టేట్ రంగంలో తమ బ్రాండ్‌కు గుర్తింపు పెంచుకోవాలనుకునే డెవలపర్లకు, అలాగే సరైన పెట్టుబడి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు TV9 Sweet Home Expo ఒక కీలక వేదికగా నిలవనుంది.

వైజాగ్ అభివృద్ధి దిశగా వేగంగా సాగుతున్న ఈ సమయంలో, సరైన నిర్ణయంతో భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే వారికి ఈ ఎక్స్‌పో ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

ఈ ఎక్స్‌పో లో స్టాల్స్ బుక్ చేసుకోవాలనుకునే వారు 99482 21642 నంబర్ కు సంప్రదించండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..