AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun transit: కుంభ రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశులకు ఊహించని లాభాలు.. పట్టిందల్లా బంగారమే..!

Sun in Aquarius: ఫిబ్రవరి నెలలో సూర్యుడు తన రాశి చక్రాన్ని మార్చబోతున్నాడు. ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన సానుకూల శక్తి, ఆనందం పెరుగుతాయి. మార్చి 15 వరకు కూడా సూర్యుడు అదే రాశిలో ఉంటాడు. సూర్యుడి సంచారంతో ఆయా రాశులకు సంబంధించిన వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Sun transit: కుంభ రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశులకు ఊహించని లాభాలు.. పట్టిందల్లా బంగారమే..!
Sun Enters Aquarius:
Rajashekher G
|

Updated on: Feb 01, 2026 | 6:44 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు చాలా ప్రాధాన్యత ఉంది. గ్రహాల సంచారం వల్ల 12 రాశులు అనుకూల, ప్రతికూల ఫలితాలు పొందుతాయి. ఫిబ్రవరి నెలలో గ్రహాల రాజుగా పరిగణింపబడే సూర్యుడు సంచారం చేయనున్నాడు. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, ధైర్యం, గుర్తింపును సూచిస్తాడు. అందువల్ల సూర్యుని కదలికలో మార్పు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ప్రస్తుత ఫిబ్రవరి నెలలో సూర్యుడు తన రాశి చక్రాన్ని మార్చబోతున్నాడు. ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన సానుకూల శక్తి, ఆనందం పెరుగుతాయి. మార్చి 15 వరకు కూడా సూర్యుడు అదే రాశిలో ఉంటాడు. సూర్యుడి సంచారంతో ఆయా రాశులకు సంబంధించిన వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి

మే 13 తర్వాత సూర్యుడి సంచారం మేష రాశి వారికి విజయానికి కొత్తదారులు తెరుచుకుంటాయి. ఈ కాలంలో చట్టపరమైన విషయాలు అనుకూలంగా మారుతాయి. మీరు అదృశ్య శత్రువులను కూడా ఓడిస్తారు. ఇది మీకు జీవితంలో భద్రత, విశ్వాసాన్ని ఇస్తుంది. వ్యాపారవేత్తలకు అనుకోని లాభాలు వస్తాయి. ముఖ్యమైన ప్రాజెక్టులతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు అవకాశం ఉంది. ఇది కెరీర్ పురోగతి దిశగా సాగుతుంది. ఊహించని లాభాలు అందుకుంటారు. గత పెట్టుబడుల నుంచి ఆదాయం అందుకుంటుంది.

తులా రాశి

సూర్యుడు కుంభరాశిలోకి మారడం వల్ల తులా రాశి వారికి సంతోషకరమైన మార్పులు వస్తాయి. మీరు మీ జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొత్త ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. వారు ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలో తమకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంటారు. ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. నైపుణ్యాలను నిరూపించుకునే అవకాశం ఉంది. పొదుపు పెరుగుతుంది. ఆర్థిక విషయానలు పద్ధతిగా నిర్వహించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు తొలగిపోయి శాంతి పెరుగుతుంది.

మకర రాశి

కుంభరాశిలోకి సూర్య సంచారం వలన మేష, తులా రాశి వారికంటే మకర రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలున్నాయి. ఈ కాలంలో వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో విజయాన్ని అందుకుంటారు. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి తమ భాగస్వామితో సంతోషకరంగా గడుపుతారు. మీ పిల్లల ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. మీకు నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు కొత్త ఆస్తి, వాహనం కొనుగోలు చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

Follow Us
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..