IND vs PAK: ఏంది ఇది.. పాక్ బహిష్కరణకు అభిషేక్, ఇషాన్ కారణమా.. ఇంత దిగజారాలా.?
India vs Pakistan: రాజకీయాలు, భద్రతా కారణాలు పక్కన పెడితే.. ప్రస్తుత టీమిండియా యువ రక్తం చూపిస్తున్న దూకుడు చూస్తుంటే, ఏ జట్టుకైనా భారత్‌ను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న విషయమే. మరి పీసీబీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేక ఈ భారీ నష్టాన్ని భరిస్తుందా అనేది చూడాలి.

Ishan Kishan vs Abhishek Sharma: క్రికెట్ ప్రపంచంలో భారత్ – పాకిస్థాన్ పోరు అంటేనే ఒక హై-వోల్టేజ్ డ్రామా. కానీ ఈసారి మైదానంలో ఆట కంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడం క్రీడా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయితే, ఈ బహిష్కరణ వెనుక రాజకీయ కారణాల కంటే.. టీమిండియా యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మల విధ్వంసకర బ్యాటింగే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది.
కుర్రాళ్ల వీరవిహారం.. పాక్ వెనకడుగు..?
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడీ పవర్‌ప్లేలో బౌలర్ల పని పట్టిన తీరుతో ప్రత్యర్ధులు వణికిపోతున్నారు. వీరిద్దరి ఫియర్ లెస్ క్రికెట్ చూసి ముఖ్యంగా పాక్ టీం వణికిపోతుందని చెబుతున్నారు.
అభిషేక్ శర్మ: స్పిన్, పేస్ అనే తేడా లేకుండా మొదటి బంతి నుండే సిక్సర్లతో విరుచుకుపడటం అభిషేక్ స్టైల్.
ఇషాన్ కిషన్: ఎడమచేతి వాటం బ్యాటర్ కావడంతో పాటు, షార్ట్ పిచ్ బంతులను అలవోకగా బౌండరీ అవతలికి పంపడంలో ఇషాన్ దిట్ట.
🚨Pakistan refuses to play India in the World Cup!🚨 They know what’s coming on Feb 15, so they backed out early. Smart move—at least they saved themselves from a 300-run thrashing! 😂 We get the points, they get to keep their dignity.#IndVspak pic.twitter.com/SSwf0vXIpp
— AJAY (@Supremacyx9) February 2, 2026
పాకిస్థాన్ బౌలింగ్ విభాగం ఎంత పటిష్టంగా ఉన్నా, ఈ ఇద్దరు కుర్రాళ్లు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ఖాయం. బహుశా తమ బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే పీసీబీ ఈ వింత నిర్ణయం తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
“కేవలం ఇద్దరు బ్యాటర్ల భయంతోనో లేక వ్యూహాత్మక కారణాలతోనో మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం. భవిష్యత్తులో ఐసీసీ ఇచ్చే నిధుల్లో కోత పడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
గమనిక: సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్స్ మేరకు ఈ ఆర్టికల్ అందించాం. కారణాలు ఏవైనా సరే, పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ పరిస్థితి సందిగ్ధంలో పడింది.
