AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరిలో జన్మించిన వారిలో సూపర్ క్వాలిటీస్.. ఇదొక్కటే మైనస్..!

February born qualities: ఫిబ్రవరిలో గ్రహాల రాజు అయిన సూర్యుడు నెలలో సగం మకర రాశిలో, మిగిలిన సగం కుంభరాశిలో సంచరిస్తాడు. శని మకరం, కుంభరాశి రెండింటినీ పాలిస్తాడు. ఫిబ్రవరిలో జన్మించిన వ్యక్తులు శని ప్రభావం కారణంగా నిజాయితీపరులు, తెలివైనవారై ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. అంతేగాక, వారి వ్యక్తిత్వాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

ఫిబ్రవరిలో జన్మించిన వారిలో సూపర్ క్వాలిటీస్.. ఇదొక్కటే మైనస్..!
February Born People
Rajashekher G
|

Updated on: Feb 01, 2026 | 4:56 PM

Share

జ్యోతిష్య శాస్త్రం రాశి ఫలితాలతోపాటు వ్యక్తులు జన్మించిన తేదీలను బట్టి వారి వ్యక్తిత్వాలను తెలియజేస్తుంది. తేదీలతోపాటు నెలలో పుట్టిన వారి గురించి కూడా వివరిస్తుంది. ప్రస్తుత ఫిబ్రవరిలో జన్మించిన వ్యక్తుల గురించి చెప్పాలంటే.. కొన్ని గ్రహాలు వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. ఫిబ్రవరిలో గ్రహాల రాజు అయిన సూర్యుడు నెలలో సగం మకర రాశిలో, మిగిలిన సగం కుంభరాశిలో సంచరిస్తాడు. శని మకరం, కుంభరాశి రెండింటినీ పాలిస్తాడు. ఫిబ్రవరిలో జన్మించిన వ్యక్తులు శని ప్రభావం కారణంగా నిజాయితీపరులు, తెలివైనవారై ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. అంతేగాక, వారి వ్యక్తిత్వాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

చురుకైన మనస్తత్వం

ఫిబ్రవరిలో జన్మించిన వ్యక్తులు చురుకైన మనస్తత్వం, దయగలవారు అయి ఉంటారు. చాలా సున్నితంగా ఉంటారు. ఇతరుల భావోద్వేగాలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఈ లక్షణాలు వారిని సులభంగా స్నేహితులను చేసుకోవడానికి, లోతైన సంబంధాలను కలిగి ఉండేందుకు సహాయపడతాయి.

నిలకడలేని ప్రేమ బంధాలు

ఈ నెలలో జన్మించిన వారు సున్నితంగా ఉన్నప్పటికీ.. తరచుగా ప్రేమతో ఇబ్బంది పడుతుంటారు. వారి ప్రేమ సంబంధాలు తరచుగా నిలకడగా ఉండవు. వారి అహం కారణంగా.. వారు తమ భాగస్వాములతో సరిగ్గా సర్దుబాటు చేసుకోలేరు.

సృజనాత్మకత

ఫిబ్రవరిలో జన్మించిన వారు సృజనాత్మకంగా ఉంటారు. వారు కొత్త ప్రణాళికలను రూపొందించడంలో, అమలు చేయడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి వారు భయపడరు. ప్రతీ విషయంలోనూ ప్రతిష్టాత్మకంగా ఉంటారు. ఈ కారణంగానే వీరు జీవితంలో సంపద, విజయం రెండింటినీ సాధిస్తారు. అదృష్టం కంటే కష్టపడి పనిచేయడాన్ని నమ్ముతారు. వీరికి కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బొమ్మలు గీయడం, సంగీతం, సాహిత్యాన్ని అనుసరిస్తే.. వీరు గొప్ప విజయం, కీర్తిని సాధిస్తారు.

స్వేచ్ఛను ప్రేమించేవారు

ఫిబ్రవరి నెలలో జన్మించిన వ్యక్తులు స్వీయ ప్రేరణ కలిగి ఉంటారు. తమ పని ద్వారా తమ కలలను నెరవేర్చుకోవడంపై దృష్టి పెడతారు. అంతేగాకుండా, వారు స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తారు. ఇతరుల నియంత్రణలో పనిచేయడానికి ఇష్టపడరు. ఇది తరచుగా వైవాహిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.