AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారి కుటుంబ జీవితం హ్యాపీ..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 2, 2026): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి కుటుంబ జీవితం హ్యాపీ..12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 02 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 02, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 2, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశముంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి రావొచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. కెరీర్ పరంగా జీవిత భాగస్వామి కూడా పురోగతి చెందుతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ముఖ్య మైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా సానుకూల ఫలితాలుంటాయి. చిన్నా చితకా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఏ రంగానికి చెందిన వారైనా వ్యక్తిగతంగా కొద్దిపాటి పురోగతి ఉంటుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూలతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశివారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ఆలోచనలు, కార్య క్రమాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కూడా మీ ఆలోచనలు సఫలం అవుతాయి. ఏ ప్రయత్నం అయినా సానుకూల ఫలితాలనిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తి గత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. సహోద్యోగులతో సామరస్యం పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు క్రమంగా చక్కబడతాయి. ఆదాయం అనుకూలంగా ఉన్న ప్పటికీ ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తవచ్చు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు మెరుగుపడడంతో పాటు, ఉద్యోగం మారే అవకాశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ప్రతి పనిలోనూ కొద్దిగానైనా శ్రమ, తిప్పట ఉంటాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. దాంపత్య జీవితం సంతోషంగా, సామరస్యంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లోనూ, సామాజిక సేవల్లోనూ పాల్గొంటారు.

Follow Us