వాస్తు టిప్స్ : జీతం పడ్డ వెంటనే అప్పులు తీర్చేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు!
Samatha
2 February 2026
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలి అంటారు. కానీ కొందరు వాస్తు నియమాలు ఉల్లంఘించిన అనేక సమస్యలు ఎదుర్కుంటారు.
వాస్తు శాస్త్రం
ఎవరు అయితే వాస్తు నియమాలు ఉల్లంఘిస్తారో వారు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు , కుటుంబ కలహాలతో సతమతం అవుతుంటారు. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంటారు.
వాస్తు నియమాలు
ఇక వాస్తు అంటే చాలా మంది ఇల్లు మాత్రమే అనుకుంటారు. కానీ చాలా విషయాల్లో వాస్తు అనేది ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మీరు తీసుకునే జీతం విషయంలో కూడా వాస్తు ప్రభావం ఉంటుందంట.
గృహం
వాస్తు ప్రకారం మీకు వచ్చిన జీతం ఎప్పుడూ నిలకడగా ఉంటూ దిన దినం వృద్ధి చెందాలి అంటే, మీరు పని చేసే కార్యాలయం ఈ శాన్య దిశ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి.
జీతం
అలాగే కొంత మంది జీతం వచ్చిన వెంటనే అప్పులు తీర్చేస్తూ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తుంటారు. అయితే ఇది కూడా అస్సలే మంచిది కాదు అంటున్నారు పండితులు.
అప్పుల తీర్చడం
దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగదంట. ఎవరు అయితే ఇంటికి వచ్చిన డబ్బు లేదా బ్యాంకులో పడిన జీతం వెంటనే ఖర్చు చేస్తారో, వారు నిత్యం ఆర్థిక సమస్యలతో పోరాటం చేస్తారంట.
లక్ష్మీదేవి
అందుకే ఇంటికి డబ్బు వచ్చినా, మీ అకౌంట్‌లో జీతం పడినా కనీసం మూడు రోజుల పాటు ఆ డబ్బును అలాగే ఉండనివ్వాలంట. దీని వలన మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది.
మూడు రోజులు
అలాగే ఇంటికి వచ్చిన డబ్బును లక్ష్మీదేవి వద్ద పెట్టి, మీ లాకర్‌లో రెండు నుంచి ఐదు రోజులు ఉంచిన తర్వాత ఖర్చులకు ఉపయోగించడం మంచిది.