AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌ కాల్.. భారత్ పై సుంకాలను ఎత్తివేస్తుందా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించారు. ఇద్దరు మధ్య సాగిన సంభాషణలకు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి ఉండాలని దేశ ప్రజలకు సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌ కాల్.. భారత్ పై సుంకాలను ఎత్తివేస్తుందా..?
Pm Narendra Modi, Donald Trump
Balaraju Goud
|

Updated on: Feb 02, 2026 | 10:14 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించారు. ఇద్దరు మధ్య సాగిన సంభాషణలకు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి ఉండాలని దేశ ప్రజలకు సూచించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోని సమయంలో ఈ సంభాషణ జరిగింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అవుతుందని ట్రంప్ పదేపదే పేర్కొంటున్నారు.

డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రసిద్ధ స్మారక చిహ్నం ఇండియా గేట్‌ను ప్రశంసించారు. ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇండియా గేట్ చిత్రాన్ని పంచుకున్నారు. వాషింగ్టన్, డిసిలో ప్రపంచంలోనే అతిపెద్ద, గొప్ప విజయోత్సవ తోరణాన్ని నిర్మించాలనే తన ప్రణాళికను ఆయన పునరుద్ఘాటించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో “భారతదేశ అందమైన విజయోత్సవ తోరణం, ఇండియా గేట్. ఇది గొప్పది” అని రాశారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాషింగ్టన్, డిసిలో ఒక పెద్ద, గొప్ప విక్టరీ గేట్ నిర్మించేందుకు ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఈ పోస్ట్ చేశారు.

ఇంతలో, ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడారని భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఈ సంభాషణలోని అంశాలకు సంబంధించి అధికారిక సమాచారం రాలేదు.

భారతదేశం – అమెరికా మధ్య మార్చి 2025 నుండి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. గత సంవత్సరం ఆగస్టు నుండి, అమెరికా భారత ఎగుమతులపై భారీ 50% సుంకాన్ని విధించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంపైనా విధించిన అత్యధిక సుంకాలలో ఒకటి. ఇందులో రష్యన్ చమురు కొనుగోలుపై 25% సుంకం కూడా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశం తగ్గింపు ధరలకు రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచింది. దీని వలన రష్యా భారతదేశపు అతిపెద్ద చమురు సరఫరాదారులలో ఒకటిగా నిలిచింది. దీంతో పాటు, మే నెలలో భారతదేశం – పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణను ముగించినట్లు ట్రంప్ చేసిన వాదన, అమెరికా కొత్త వలస విధానం వంటి అనేక ఇతర అంశాల కారణంగా సంబంధాలు కూడా ప్రభావితమయ్యాయి.

ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం (ఫిబ్రవరి 1, 2026) భారతదేశం ఇప్పుడు ఇరాన్ నుండి కాకుండా వెనిజులా నుండి చమురు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. వెనిజులాలో చట్టపరమైన సంస్కరణల తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు ఆయన అన్నారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన “ఆత్మస్నేహితుడు” అని అద్భుతమైన మానవుడుగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య చాలా విషయాలు జరగబోతున్నాయని అన్నారు. ఇక ఇప్పటివరకు రెండు దేశాల మధ్య ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశం తగ్గింపు ధరలకు రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచింది. దీని వలన రష్యా భారతదేశపు అతిపెద్ద చమురు సరఫరాదారులలో ఒకటిగా నిలిచింది.

అరుదైన ఖనిజాల సరఫరా గొలుసులపై వాషింగ్టన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం (ఫిబ్రవరి 2) మూడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరారు. కొంతకాలంగా క్షీణించిన తర్వాత రెండు వ్యూహాత్మక భాగస్వాముల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నందున జైశంకర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

దీని బట్టి చూస్తుంటే భారత్ – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కావచ్చు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు పూర్తయ్యే దశలో ఉందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సూచించారు. అయితే, సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..