AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రోడ్డు పక్కన టీ తాగుతున్నారా? అయితే మీకు క్యాన్సర్, కలరా గ్యారెంటీ.. ఈ ఘోరం చూడండి!

భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం కాదు, కోట్లాది మందికి అదొక భావోద్వేగం. ఉదయం నిద్ర లేచింది మొదలు, ఆఫీసు ఒత్తిడిని దూరం చేసుకోవడం వరకు ప్రతి ఒక్కరికీ ఒక కప్పు వేడి వేడి చాయ్ కావాల్సిందే..! అందుకే గల్లీ చివరన ఉండే చిన్న టీ కొట్టు నుండి హైవే పక్కన ఉండే డాబాల వరకు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే, మనం అంత ఇష్టంగా తాగే ఈ టీని ఎంతవరకు పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Watch: రోడ్డు పక్కన టీ తాగుతున్నారా? అయితే మీకు క్యాన్సర్, కలరా గ్యారెంటీ.. ఈ ఘోరం చూడండి!
Roadside Tea Stall
Balaraju Goud
|

Updated on: Jul 14, 2026 | 8:17 PM

Share

భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం కాదు, కోట్లాది మందికి అదొక భావోద్వేగం. ఉదయం నిద్ర లేచింది మొదలు, ఆఫీసు ఒత్తిడిని దూరం చేసుకోవడం వరకు ప్రతి ఒక్కరికీ ఒక కప్పు వేడి వేడి చాయ్ కావాల్సిందే..! అందుకే గల్లీ చివరన ఉండే చిన్న టీ కొట్టు నుండి హైవే పక్కన ఉండే డాబాల వరకు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే, మనం అంత ఇష్టంగా తాగే ఈ టీని ఎంతవరకు పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో చూస్తే, బయట టీ తాగే ముందు ఎవరైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించక మానరు.

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా @Murti_Nain అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. ఈ వైరల్ వీడియోలో, ఒక రోడ్డు పక్కన ఉండే టీ వ్యాపారి ఎలాంటి భయం, సంకోచం లేకుండా టీ తయారు చేస్తున్నాడు. అయితే అక్కడ అసలు సమస్య అతను వాడే చక్కెర దగ్గర వచ్చింది. ఆ దుకాణంలో ఉన్న చక్కెర గిన్నెపై వందల కొద్దీ ఈగలు వాలి, భీభత్సంగా ఝుమ్మని శబ్దం చేస్తూ ముసురుకున్నాయి. ఆ వ్యాపారి ఆ ఈగలను తోలే ప్రయత్నం కూడా చేయకుండా, నేరుగా ఆ ఈగలు పట్టిన చక్కెరనే స్పూన్‌తో తీసి మరుగుతున్న టీ గిన్నెలో వేసేశాడు.

ఈ దృశ్యం ఎంతో అసహ్యంగా ఉంది. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే అక్కడ నిలబడిన వినియోగదారుల వైఖరి. దుకాణం చుట్టూ చాలా మంది కస్టమర్లు నిలబడి ఉన్నారు. కళ్లెదుటే అంత అపరిశుభ్రంగా, ఈగలు ముసిరిన చక్కెరతో టీ తయారు చేస్తున్నా ఎవరూ అతడిని నిలదీయలేదు, ఆపడానికి ప్రయత్నించలేదు. ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఆ నిర్లక్ష్యాన్ని చూస్తూ కూడా జనం తమ చాయ్ కప్పు కోసం నిశ్శబ్దంగా వేచి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియో వైరల్ అవుతుండటంతో.. ఆన్‌లైన్‌లో విపరీతమైన చర్చకు దారితీసింది. నెటిజన్లు సదరు వ్యాపారి నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇది వ్యాపారం కాదు, ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న ప్రాణాంతక ఆట” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, “చూస్తూ కూడా నోరు విప్పని కస్టమర్లదే అసలు తప్పు” అని మరికొందరు మండిపడుతున్నారు. బయట దొరికే ఇలాంటి అపరిశుభ్ర ఆహార పదార్థాల వల్ల టైఫాయిడ్, కలరా, విరేచనాలు వంటి తీవ్రమైన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అలసత్వాన్ని వీడి, బయట ఏదైనా తినేటప్పుడు లేదా తాగేటప్పుడు సదరు దుకాణం యొక్క పరిశుభ్రతను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవడం ఎంతో ముఖ్యం.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం