Horoscope Today: ఈ రాశివారికి కుటుంబ విషయాల్లో ఇబ్బందులు తప్పవు.. వ్యాపారాలలో రాణిస్తారు

Horoscope Today: ప్రస్తుతం కాలంలోనూ చాలా మంది తమ తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికీ రాశిఫలాలను..

Horoscope Today: ఈ రాశివారికి కుటుంబ విషయాల్లో ఇబ్బందులు తప్పవు.. వ్యాపారాలలో రాణిస్తారు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 18, 2021 | 6:27 AM

Horoscope Today: ప్రస్తుతం కాలంలోనూ చాలా మంది తమ తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారు కూడా చాలా మందే ఉన్నారు. వారు రోజును ప్రారంభించే ముందు తమ తమ రాశి ఏ విధంగా ఉందో తెలుసుకుని పనులు చేపడుతుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 18న) శుక్రవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి:

ఈ రాశివారు ఈ రోజు కుటుంబ, ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఒప్పందాలు చేసుకోవడం మంచిది కాదు. అమ్మవారికి అభిషేకం చేయడం మంచిది.

వృషభరాశి:

వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఈ రాశివారు పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అకస్మిక ప్రయాణాలు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. మహాలక్ష్మీ అమ్మవారికి అర్చన చేయడం మేలు చేస్తుంటుంది.

మిథున రాశి:

ఒప్పందాల విషయాలలో తొందరపాటు మంచిది కాదు. ఆచితూచి అడుగులు వేయాలి. వ్యాపారాలలో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. గౌరి అమ్మవారి నామస్మరణ ఎంతో మేలు చేస్తుంటుంది.

కర్కాటకరాశి:

ఈ రాశివారు రోజు కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తొందరపడి పలు కార్యక్రమాలు చేపట్టడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. లలితా సహాస్రపారాయణం మేలు చేస్తుంది.

సింహరాశి:

వ్యాపార ఉద్యోగ విషయం అనుకూలమైన ఫలితాలు, జాగ్రత్తలుతీ నవగ్రహ స్తోత్ర పారాయణ

కన్యరాశి:

తాము చేపట్టిన పనులు పెద్దవారి సంపూర్ణ మద్దలు పలుకుతారు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ గణపతి ఆరాధన మేలు చేస్తుంటుంది.

తులారాశి:

కుటుంబ పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విష్ణు సహాస్రనామ పారాయణం చేయడం ఎంతో మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

ఈ మధ్యనే ఉద్యోగాల్లో చేరిన వారు విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆలోచన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మవారి అభిషేకం మేలు చేస్తుంటుంది.

ధనుస్సు రాశి:

ఈ రాశివారు శక్తికి మంచిన అప్పులు చేసే అవకాశం ఉంది. అందుకు ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంటా, బయట ఒత్తిడిలు ఏర్పడతాయి. సుదర్శనస్వామి నామ స్మారణ మేలు చేస్తుంటుంది.

మకరరాశి:

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంటా బయట ఒత్తిడికలు తప్పవు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని. సుదర్శన స్వామి నామ స్మరణ మేలు చేస్తుంటుంది.

కుంభరాశి:

ఈ రాశివారు ఈ రోజు చేపట్టిన పనులు పూర్తవుతాయి. తెలివితేటలతో ముందుకు వెళ్తుంటారు. కుటుంబంలో, స్నేహితుల్లో గౌరవం పెరుగుతుంది. దేవి స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి:

ఈ రాశివారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచన విధానాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఒత్తిడిలు ఉంటాయి. మహాలక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణం, అన్నదాన కార్యక్రమం వంటివి మేలు చేస్తుంటుంది.