Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ఇబ్బందులే..!
Horoscope Today: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు చాలా మంది..
Horoscope Today: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు చాలా మంది ఉంటారు. వారు రోజును ప్రారంభించే ముందు తమ తమ రాశి ఏ విధంగా ఉందో తెలుసుకుని పనులు చేపడుతుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 17న) గురువారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి:
ఈ రాశివారు ఈ రోజు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకు ఇచ్చిన హామీల ఉండటంతో వారి నుంచి ఒత్తిడికి వస్తుంటాయి. సుదర్శనస్వామి నామస్మరణ ఎంతో మేలు చేస్తుంటుంది.
వృషభరాశి:
ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అష్టలక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.
మిథున రాశి:
ఈ రాశివారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేర్వేరు రూపాల్లో పలువురు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తుంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గౌరి అమ్మవారి నామస్మరణం మేలు చేస్తుంటుంది.
కర్కాటకరాశి:
ఈ రాశివారు ఈ రోజు స్నేహితుల విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవనసరమైన విషయాలు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. పార్వతి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంటుంది.
సింహరాశి:
ఈ రోజు ఈ రాశివారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటుంటారు. ఖర్చులు పెరిగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహాలక్ష్మీ అమ్మవారి నామస్మరణం మేలు చేస్తుంటుంది.
కన్యరాశి:
శక్తికి మించిన అప్పులు చేస్తుంటారు ఈ రాశివారు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించడం మంచిది. అమ్మవారి నామస్మరణం మేలు చేస్తుంటుంది.
తులారాశి:
ఈ రాశివారు పలు విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయాల్లో అప్రమత్తం ఉండాలి. ఆలోచనలు పెరిగి అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అమ్మవారి అర్చన మేలు చేస్తుంటుంది.
వృశ్చిక రాశి:
ఇతరులు అందించిన సలహాలు సూచనలు స్వీకరిస్తుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ధన్వంతరి స్టోత్రపారాయణం చేయడం మేలు జరుగుతుంది.
ధనుస్సు రాశి:
ఈ రాశివారు గతంలో చేపట్టి నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మహాలక్ష్మీ అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంటుంది.
మకరరాశి:
ఈ రాశివారు ఈ రోజు కొన్ని రకాల ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యమైన వార్తలు వింటారు. చేపట్టే పనుల విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది. అమ్మవారి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంటుంది.
కుంభరాశి:
విలువైన వస్తువులు, భూ సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో గొడవలు ఏర్పడకుండా చూసుకోవడం మంచిది. భూస్తూత్ర పారాయణం మేలు చేస్తుంటుంది.
మీనరాశి:
ఉద్యోగ విషయాలలో అనుకూలంగా ఉంటుంది. సలహాలు, సూచనలు పాటించాలి. లక్ష్మీనారాయణస్వామి పారాయణం మేలు చేస్తుంటుంది.