Horoscope Today: చిన్న అనారోగ్య సమస్య అయినా అశ్రద్ధ చేయకండి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు..
Daily Horoscope(August 05): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఎలా ఉంటుంది? ఆగస్టు 05, 2023న(శనివారం) మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
Daily Horoscope (August 05, 2023): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఎలా ఉంటుంది? ఆగస్టు 05, 2023న(శనివారం) మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశిలో ఉన్న గురువు, అయిదవ స్థానంలో ఉన్న బుధ, శుక్ర, కుజ గ్రహాల కారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది మంచి ఫలితాలనే ఇస్తుంది. కొత్తవారితో స్నేహ సంబంధాలు ఏర్ప డ తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందు తుంది. బాకీలు వసూలు అవుతాయి. చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ ను కలుసుకోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): నాలుగవ స్థానంలో, అంటే సుఖ స్థానంలో మూడు శుభ గ్రహాలు సంచరిస్తున్నందువల్ల ఉద్యోగ జీవితంలో ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ పురో గతి ఉంటుంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి, కన్సల్టెన్సీ, మార్కెటింగ్, రవాణా వంటివి రాణిస్తాయి. కుటుంబానికి సంబంధించి కొత్త సంగతులు వినడం జరుగుతుంది. ఆస్తి వివాదాల్లో మాన సిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి విముక్తి లభించే సూచనలు న్నాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ప్రస్తుతానికి లాభ స్థానం, ధన స్థానం పటిష్టంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటు ఉండదు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన ఏ వ్యవహారమైనా సాను కూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి. వ్యాపారాల్లో కష్టానికి మించిన ప్రతి ఫలం ఉంటుంది. కుటుంబ జీవితం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం జాగ్తత్త.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. తోబుట్టువుల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ స్థానం, ధన స్థానం బలంగా ఉన్నందువల్ల ఉద్యోగ రీత్యా లాభాలు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి చెందుతా యి. అష్టమ శని కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యం కావడంతో పాటు, ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కర్కాటకంలో ఉన్న రవి గ్రహం వల్ల మంచి పరిచయాలు ఏర్పడతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): భాగ్య స్థానంలో గురువు, సింహ రాశిలో మూడు శుభ గ్రహాలు ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. రాశ్యధి పతి వ్యయంలో ఉండడం వల్ల ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపో తుంది. పిల్లల నుంచి ఆశించిన మంచి సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ధన కారకుడైన గురువు అష్టమ స్థానంలో ఉండడం, మూడు గ్రహాలు వ్యయ స్థానంలో ఉండడం వల్ల డబ్బు బాగా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్త వుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సప్తమ స్థానంలో శుభగ్రహమైన గురువు ఉండడం, లాభస్థానంలో మూడు గ్రహాలు చేరడం వల్ల ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో శనీశ్వరుడి వల్ల పిల్లల నుంచి శుభవార్తలు వినడం, వారు వృద్ధిలోకి రావడం వంటివి జరుగుతాయి. రాశ్యధి పతి అయిన శుక్రుడు లాభస్థానంలో వక్రించడం వల్ల స్నేహితులతో విలాసాల ఖర్చు చేసే అవ కాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆరవ స్థానంలో ఉన్న రాహువు వల్ల, దశమ స్థానంలో మూడు గ్రహాలు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమై పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడ తాయి. వ్యాపారాలు కూడా సజావుగా సాగిపోతాయి. రాశ్యధిపతి కుజుడు మిత్ర క్షేత్రంలో ఉండడం వల్ల ఆరోగ్యం చక్కబడడం, దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కోలుకోవడం వంటివి జరుగు తాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు వక్రించడం వల్ల జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండడం, మూడు గ్రహాలు భాగ్యస్థానంలో ఉండడం తప్పకుండా మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. పితృ కారకుడైన రవి అష్టమ స్థానంలో సంచరిస్తున్నందువల్ల తండ్రి ఆరోగ్యానికి భంగం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో శనీశ్వరుడు బలంగా సంచరిస్తున్నందువల్ల ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. ఆచితూచి ఖర్చు చేయడానికి, ఖర్చులు అదుపులో ఉండడానికి అవకాశం ఉంది. నాలుగవ స్థానంలో ఉన్న గురువు వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడడం జరుగుతుంది. ఆ స్థానంలోనే రాహువు కూడా ఉండడం వల్ల అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అష్టమ స్థానంలో మూడు గ్రహాలు చేరడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): సప్తమ స్థానంలో మూడు శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల, వాటిని రాశ్యధిపతి శని, ధన స్థానాధిపతి గురువు చూస్తున్నందువల్ల, ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఈ రాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడి కారణంగా అప్పుడప్పుడు శ్రమ, స్వల్ప అనారోగ్యాలు తప్పవు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశి అధిపతి అయిన గురువు ధన స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఆదాయానికి లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఇదే రాశిలో రాహువు కూడా సంచరిస్తున్నందువల్ల డబ్బు వృథా కావడం, నష్టపోవడం జరుగుతుంది. ఆరవ స్థానంలో మూడు గ్రహాల సంచారం వల్ల శత్రు, రోగ, రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి