Horoscope Today(11 August): ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 11, 2023న(శుక్రవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today(11 August): ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
Horoscope Today (11 August 2023)
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Basha Shek

Updated on: Aug 11, 2023 | 6:43 AM

Daily Horoscope (August 11): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 11, 2023న(శుక్రవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో బిజీగా ఉండడం జరుగుతుంది. లాభాలకు, ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చక పోవడం చాలా మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు చాలావరకు పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యో గంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): కొత్త వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి.  వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. బంధువుల రాక వల్ల కుటుం బంలో సందడి నెలకొంటుంది. ఉద్యోగంలో ప్రశాంత, ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడి ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంపాదన మెరుగుపడు తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. రుణగ్రస్తుల నుంచి రావాల్సిన డబ్బు సకా లంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు కీలక సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం ఇబ్బంది పెడు తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సోదర వర్గంతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. వ్యక్తిగత కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఎంతో శ్రమ పడి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రోజంతా అనవసర ఖర్చులుంటాయి. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి కానీ, శ్రమ, ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ఒకటి రెండు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించకపోవచ్చు. ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో, సామాజిక సేవల్లో పాల్గొనే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలో చనలు, కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రువులతో సైతం సఖ్యత ఏర్పడు తుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచ నలతో ముందుకు సాగుతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. ఇల్లు మారాలనే ఆలోచన చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యో గాల్లో సామరస్యంగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఏ విషయంలోనైనా, ఏ రంగాల వారికైనా సమయం చాలా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. మాట చెలామణీ అవుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి.వ్యాపారాల్లో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆరో గ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల కారణంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం తప్పనిసరి అవుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రతి పనీ ఆలస్యం కావడానికి, ప్రతి పనిలోనూ శ్రమ పెరగడానికి అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధ మైన వ్యవహారాలు పరిష్కార దిశగా కొనసాగుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగం విషయంలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలు తీసుకు వస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండ డం మంచిది. బంధు మిత్రుల నుంచి అవసర సమయాల్లో సహాయ సహకారాలు అందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): జీతభత్యాల విషయంలో అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి,వ్యాపారాల్లో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. అదనపు సంపాదన పెరుగుతుంది. ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితం ఇస్తుంది. తల్లితండ్రుల నుంచి కోరుకున్న సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి