Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.. 12 రాశులవారికి రాశిఫలాలు
Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 12, 2023న(శనివారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతిష్టంభనలు తొలగి, అన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరుగు తాయి. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేస్తారు. కుటుంబ పెద్దల ద్వారా ఆశించిన లబ్ధి పొందుతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా మంచి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. జీవిత భాగస్వామి స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక ప్రయత్నాల్లో అవరోధాలు తొలగి, ఆశించిన విధంగా సఫలం అవుతాయి. సాధారణంగా ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహ కాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పను లను సునాయాసంగా, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు చాలావరకు లాభాల బాటలో సాగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థికపరంగా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత ఉంటుంది. అష్టమ శని ప్రభావం వల్ల వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సంబంధం లేని విష యాల్లో కూడా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా తలకెత్తుకోవాల్సి వసు్ంది. కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఊహించని విధంగా కొందరు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వితరణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకునే ప్రయ త్నం చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): బాగా సన్నిహితులైన మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా విద్య, ఉద్యోగావకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభించడం వల్ల, సహచరులు జాగ్రత్తగా ఉండడం ప్రారంభిస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా క్రమశిక్షణతో వ్యవహ రించడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి ఆర్థిక సమస్య నొకదాన్ని పరిష్కరించుకుంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఏ ప్రయత్నం తలపెట్టినా కొద్దో గొప్పో విజయం ఉంటుంది. సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి బాగా లాభాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు దూసుకుపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వ్యక్తిగత కార్యకలాపాలు పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరు లకు తొందరపడి మాట ఇవ్వకపోవడం మంచిది. కుటుంబ పెద్దల్లో ఒకరిని అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. సహోద్యోగులు సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఆదాయానికి సంబంధించి తాజాగా చేసే ప్రయత్నాలు సమస్యాత్మకంగా మారతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఏ విషయంలోనైనా సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులు మీద పడతాయి. బంధువుల రాకపోకలు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనకు అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అవసరమైతే ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. స్థలాలు, పొలాలకు సంబంధించిన వివాదాలు పెద్దల జోక్యంతో చాలా వరకు తొలగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. అధికారులతో సామరస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యాపారాల్లో మీ వ్యూహాలు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసు కోవడం వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. సొంత ఆలోచనలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దు. ఆర్థిక ప్రయత్నాల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. బంధుమిత్రులు సహాయం చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అయితే, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. దాయాదులతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రము ఖుల ఆదరణ పెరుగుతుంది. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో అధికా రుల సహాయ సహకారాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా ముందుకు సాగేటట్టు చర్యలు తీసుకుంటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి