AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC గ్రాడ్యుయేట్ CBT 1 ఫలితాలు విడుదల.. మీ రోల్ నంబర్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి

RRB NTPC Graduate Result 2026 declared: దేశవ్యాప్తంగా 5,810 రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ CBT-1 పరీక్ష ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ తమ ప్రాంతీయ RRB వెబ్‌సైట్ల ద్వారా స్కోర్‌కార్డులు, మెరిట్ జాబితాలు, కట్‌ఆఫ్ మార్కులను చెక్ చేసుకోవచ్చు..

RRB NTPC గ్రాడ్యుయేట్ CBT 1 ఫలితాలు విడుదల.. మీ రోల్ నంబర్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి
RRB NTPC CBT 1 Results
Srilakshmi C
|

Updated on: Jun 12, 2026 | 6:07 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 12: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఉద్యోగాలకు ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవెల్ (CEN 06/2025) సీబీటీ 1 ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టులకు రాత పరీక్ష రాసిన అభ్యర్ధులు సంబంధిత ఆర్‌ఆర్‌బీ రీజియన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల స్కోర్‌ కార్డులు, జోన్ల వారీగా మెరిట్ జాబితాలను అధికారిక ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే CBT 1 కట్-ఆఫ్ మార్కులను కూడా విడుదల చేసింది.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ 1 ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ ఏడాది మార్చి 16 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో ఆర్‌ఆర్‌బీ గ్రాడ్యుయేట్‌ సీబీటీ 1 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 5,810 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల భర్తీకి రాత పరీక్షను నిర్వహించింది. ఎంపిక ప్రక్రియలోని మొదటి దశ సీబీటీ 1లో అర్హత సాధించిన అభ్యర్థులు CBT 2 పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ 1 ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సీబీటీ 1లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు తమ రోల్ నంబర్లను పీడీఎఫ్ (PDF) రూపంలో అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్‌లో రోల్‌ నంబర్ ఉన్న వారంతా తదుపరి దశ అయిన సీబీటీ 2 పరీక్ష రాయడానికి అర్హత సాధించారు. ఇది జూలై 2026లో జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), టైపింగ్ నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష వంటి తదుపరి దశలకు కూడా హాజరు కావాల్సి రావచ్చు. ఇది సంబంధిత పోస్టుపై ఆధారపడి ఉంటుంది. నియామక ప్రక్రియలో అన్ని దశల్లో అర్హత సాధించిన వారిని మాత్రమే తుది ఎంపిక చేస్తారు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ 1 ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ (CCTS), జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (JAA), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. చండీగఢ్, సికింద్రాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, రాంచీ సహా పలు ప్రాంతీయ జోన్ల ఫలితాలు ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. RRB NTPC CBT 1 స్కోర్‌కార్డ్ జూన్ 12, 2026న సాయంత్రం 5 గంటలకు అభ్యర్థి లాగిన్ పోర్టల్‌లోనూ అందుబాటులో ఉంటుంది. స్కోర్‌కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ 1 ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!