నాని సినిమాలో క్రేజీ బ్యూటీ.. అమ్మాడి ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే..

Rajitha Chanti

Pic credit - Instagram

12 June 2026

కన్నడ చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ సూపర్ హిట్ అందుకుని మొదటి సినిమాతోనే దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ రుక్మిణీ వసంత్

సహజ నటనతో, క్యూట్ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.

ప్రస్తుతం ఈ భామ చేతిలో పాన్ ఇండియా స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇవన్నీ పట్టాలెక్కి ఉండగానే, రుక్మిణీ వసంత్ తెలుగులో మరో స్టార్ హీరో పక్కన క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు టాలీవుడ్‌లో సరికొత్త ప్రచారం సాగుతోంది.

సహజ నటుడు నానికి చెందిన సొంత నిర్మాణ సంస్థ 'వాల్‌పోస్టర్ సినిమా' పతాకంపై త్వరలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానునట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

విలక్షణమైన కథలతో సినిమాలు నిర్మించే ఈ బ్యానర్‌లో రాబోయే కొత్త ప్రాజెక్ట్ కోసం రుక్మిణీ వసంత్‌ను కథానాయికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. 

‘దండోరా’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

 కథానాయికగా రుక్మిణి దాదాపు ఖరారైనట్లే అని టాక్ నడుస్తుండగా, ఈ చిత్రంలో నటించబోయే ప్రధాన హీరో ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. చూడాలి మరీ.