Horoscope Today: దగ్గర బంధువులు తప్పుదోవ పట్టించే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today (07th Sep): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం (సెప్టెంబరు 7న) 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

Horoscope Today: దగ్గర బంధువులు తప్పుదోవ పట్టించే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 07th September 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 07, 2023 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తుల కొనుగోలు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించినంతగా ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులు, అధికారుల సహాయ సహకారాలుంటాయి. ఇష్టమైన బంధువులు రావడంతో కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వ్యయ ప్రయాసలున్నప్పటికీ, ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో ఆస్తి వివాదం ఒకదానిని చక్కబెడతారు. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): సోదర వర్గంతో వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొత్త వ్యూహాలతో వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సా హకాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడి ఇబ్బందిపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. వ్యాపా రాలు నిలకడగా సాగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం మంచిది. తలపెట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. ఆరోగ్య పరంగా కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఆస్తి విషయంలో తోబుట్టువులతో సమస్యలు తలెత్తుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రోజంతా ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోతుంది. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. లాభదాయకమైన పరిచయాలు పెరుగుతాయి. దగ్గర బంధు వుల సహాయంతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. పిల్లల్లో ఒకరికి విద్య లేదా ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ జీవితం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపా దించుకుంటారు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలలో తోబుట్టువులతో ఇబ్బం దులు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్ట డానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ఆర్థికాభివృద్ధి సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువులకు సంబంధించిన ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అత్యవసర వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. దగ్గర బంధువులు లేదా ఒకరిద్దరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగు తాయి. అధికారుల నుంచి ఆదరణతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందుకుంటారు. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులు సానుకూల సమాచారం అందుకునే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు కొదువ ఉండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. రోజంతా రొటీన్ గా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. కొందరు మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం విషయంలో సోదరులతో రాజీమార్గం అనుసరిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు స్నేహితుల సహాయంతో పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా ముందుకు దూసుకు వెడతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు