Astro Tips of Shami: శమీ ఆకులు, పువ్వులతో శివయ్యను ఈ విధంగా పూజించండి.. జంగమయ్య అనుగ్రహం మీ సొంతం..

శనీశ్వరుడికి ఇష్టమైన వృక్షం జమ్మి చెట్టు. కనుకనే దీనిని దేవవృక్ష అంటారు. శమీ ఆకులను శివుడు, శనీశ్వరుడు, గణేశునికి సమర్పిస్తారు. అంతేకాదు జమ్మి ఆకులతో చేసే పూజతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాస్తు శాస్త్రంలో పేర్కొంది. శమీ పుష్పంతో చేసే కొన్ని సులువైన నివారణలతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యోగం పొందవచ్చు..  కష్టాలన్నింటినీ తొలగిస్తుందని విశ్వాసం.. 

Astro Tips of Shami: శమీ ఆకులు, పువ్వులతో శివయ్యను ఈ విధంగా పూజించండి.. జంగమయ్య అనుగ్రహం మీ సొంతం..
Astro Tips Of Shami Plant
Follow us
Surya Kala

|

Updated on: Sep 07, 2023 | 9:14 AM

శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు హిందువులకు అత్యంత పవిత్రమైన చెట్టు. పూజలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. వినాయక చవితి రోజున మాత్రమే కాదు శివుడి పూజలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో కూడా శమీ ఆకులను ఉపయోగిస్తారు. శమీ ఆకులు, పువ్వులంటే శివునికి చాలా ఇష్టం. శనీశ్వరుడికి ఇష్టమైన వృక్షం జమ్మి చెట్టు. కనుకనే దీనిని దేవవృక్ష అంటారు. శమీ ఆకులను శివుడు, శనీశ్వరుడు, గణేశునికి సమర్పిస్తారు. అంతేకాదు జమ్మి ఆకులతో చేసే పూజతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాస్తు శాస్త్రంలో పేర్కొంది. శమీ పుష్పంతో చేసే కొన్ని సులువైన నివారణలతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యోగం పొందవచ్చు..  కష్టాలన్నింటినీ తొలగిస్తుందని విశ్వాసం..

ఉద్యోగం కోసం శమీ పుష్పంతో జ్యోతిష్య పరిహారాలు

ఎవరైనా ఉద్యోగం కోల్పోయినా లేదా చాలా కాలంగా నిరుద్యోగిగా ఉన్నట్లయితే.. వారు శమీ పుష్పంతో శివుడిని పూజ చేయాలి. శనివారం జమ్మి పుష్పం తో చేసే పూజ ఫలవంతం అయితే.. అదే శ్రావణ శనివారం ఈ పరిహారం చేస్తే అత్యంత ఫలవంతం.. లేదంటే శివుడికి ఇష్టమైన సోమవారం చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

కష్టాలు, బాధలను తొలగించుకోవడానికి

ఎవరైనా విపరీతమైన బాధలు కష్టాలతో ఇబ్బంది పడుతుంటే శివయ్యను ఆశ్రయించండి. భోళాశంకరుడిని ఏడు జమ్మి పువ్వులను సమర్పించి పూజ, అభిషేకాలు చేయండి. ఈ పరిహారాన్ని ప్రదోష కాలంలో ప్రతిరోజూ  చేయండి. అంతేకాదు సోమవారం, ప్రదోషం, శివరాత్రి, సోమవారం వచ్చే అష్టమి తిథి మొదలైన రోజుల్లో ఈ పరిహారాన్ని చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శివయ్య అనుగ్రహం కోసం

భగవంతుడు భోళాశంకరుడి అనుగ్రహం పొందాలనుకునే వారు ప్రదోష కాలంలో శివలింగంపై జమ్మి  ఆకులను సమర్పించాలి. శమీ ఆకులను నైవేద్యంగా పెట్టడం ద్వారా శివుడు ఎంతో సంతోషిస్తాడు. జమ్మితో శివయ్యను రోజూ పూజించిన వ్యక్తి మరణానంతరం జన్మ నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం.

శనీశ్వరుడి అనుగ్రహం కోసం

శనివారం నాడు శనీశ్వరుడి అనుగ్రహం కోసం శమీ ఆకులను నైవేద్యంగా సమర్పించడం వలన కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఏలి నాటి శని లేదా శని దోషం ఉన్నవారు శనీశ్వరుడికి శనివారం జమ్మి ఆకులతో పూజ చేయడంతో అతని బాధలు తీరి సుఖ సంతోషాలతో జీవిస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)