వారికి అనుకూలంగా మరనున్న గురు గ్రహం.. నేటి నుంచి ఈ 5 రాశుల జీవితాల్లో మార్పు పక్కా..

ఈ నెల 5 (మంగళవారం) తర్వాత నుంచి అయిదు రాశుల వారి జీవితాల్లో కొద్దిగా ప్రతికూలతలు తగ్గుతున్నాయి. ఆ రోజు నుంచి రాహు, కేతువులు కాకుండా మూడు గ్రహాలు వక్రించడమే కాకుండా పరిస్పరం దృష్టి కలిగి ఉండడం వల్ల ఈ ఐదు రాశుల వారి జీవితాల్లో ఒకటి రెండు నెలల పాటు కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

వారికి అనుకూలంగా మరనున్న గురు గ్రహం.. నేటి నుంచి ఈ 5 రాశుల జీవితాల్లో మార్పు పక్కా..
zodiac signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 05, 2023 | 12:33 PM

Zodiac Signs in Telugu: ఈ నెల 5 తర్వాత నుంచి అయిదు రాశుల వారి జీవితాల్లో కొద్దిగా ప్రతికూలతలు తగ్గుతున్నాయి. ఆ రోజు నుంచి రాహు, కేతువులు కాకుండా మూడు గ్రహాలు వక్రించడమే కాకుండా పరిస్పరం దృష్టి కలిగి ఉండడం వల్ల వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారి జీవితాల్లో ఒకటి రెండు నెలల పాటు కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ రాశుల వారికి గురు గ్రహం ఏమంత అనుకూలంగా లేదు. అయితే, ఈ నెల 5 నుంచి గురువు వక్రించి అనుకూలంగా మారబోతోంది. వక్రించిన గ్రహాలైన శని, గురు, బుధ గ్రహాల మధ్య పరస్పరం దృష్టి ఏర్పడడం కూడా ఈ రాశుల వారికి అనుకూలించబోతోంది. గ్రహాలు వక్రించడం వల్ల తమ వెనుక రాశుల మీద వాటి ప్రభావం పడుతుంది. దీనివల్ల ఈ 5 రాశుల వారికి అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఇవి గొప్ప యోగాలు కాకపోవచ్చు.

  1. వృషభం: ఈ రాశివారికి గురు, శని, బుధ గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతోంది. సాధారణంగా ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంటుంది. చదువులు లేదా ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి శుభ సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా మెరుగుపడతాయి. పదిమందికీ సహాయం చేసే అవకాశం లభిస్తుంది. లాభస్థానం మీద గురువు, భాగ్యస్థానం మీద శని ప్రభావం పడడం వల్ల తప్పకుండా ఏదో విధమైన అదృష్టం పట్టే అవకాశం ఉంటుంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి బుధ, గురు గ్రహాలు అసాధారణంగానూ, శనీశ్వరుడు సాధారణంగానూ అనుకూలించబోతున్నారు. ఫలితంగా వ్యక్తిగత, కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఎన్నడూ అనుభవానికి రాని మనశ్శాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదువ ఉండదు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. తప్పకుండా సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  3. కన్య: ఈ రా‌శివారికి గురు, బుధ గ్రహాలు ఎక్కువగానూ, శనీశ్వరుడు కాస్తంత తక్కువగానూ అదృష్టాన్ని తీసుకు రాబోతున్నాయి. కెరీర్ పరంగా ఆర్థిక లాభాలు చేకూరడం, మంచి గుర్తింపు ఏర్పడడం, ప్రమోషన్లు రావడం, అధికారం చేపట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒత్తిడి లేకుండా, మనశ్శాంతిగా గడిచిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం గడించడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి శని, గురు, బుధ గ్రహాలు మూడూ శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం నుంచి, ఒత్తిడి నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగావకాశాలు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని కుటుంబ, వ్యక్తిగత సమస్యల నుంచి, బరువు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల బెడద కూడా వీలైనంతగా తగ్గు ముఖం పడుతుంది. ప్రశాంతంగా విహార యాత్రలు చేయడానికి వీలుంటుంది.
  5. మకరం: ఈ రాశివారికి గురు, శని, బుధుల వల్ల తప్పకుండా అదృష్టం పడుతుంది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న అధికార యోగానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ప్రతిఫలం లేని బరువు బాధ్యతలను తగ్గించుకుంటారు. కుటుంబ సమస్యలను పరిష్కరించడం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా వేగం పుంజుకుంటాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆస్ట్రాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..