Foreign Travel Yoga: ఆ రాశుల వారికి విదేశీయాన యోగం పట్టనుంది.. అందులో మీరున్నారా..?
సాధారణంగా సంప్రదాయాలకు, విలువలకు, ప్రమాణాలకు ప్రతి రూపమైన గురు గ్రహం వక్రిస్తే ఏమవుతుంది? సాంప్రదాయిక భావాల నుంచి, ధోరణుల నుంచి బయటపడి, ఆధునిక భావాలను ఒంటబట్టించుకోవడం జరుగుతుంది. ఆధునికతకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభం అవుతుంది. వక్ర గురువు ప్రభావంతో ఏడు రాశుల వారికి విదేశీయాన యోగం పట్టనుంది.
సాధారణంగా సంప్రదాయాలకు, విలువలకు, ప్రమాణాలకు ప్రతి రూపమైన గురు గ్రహం వక్రిస్తే ఏమవుతుంది? సాంప్రదాయిక భావాల నుంచి, ధోరణుల నుంచి బయటపడి, ఆధునిక భావాలను ఒంటబట్టించుకోవడం జరుగుతుంది. ఆధునికతకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభం అవుతుంది. ఆధునిక జీవనశైలి, ఆధునిక అలవాట్లు, విదేశాల్లో జీవనం వంటివి ప్రాముఖ్యం సంతరించుకుంటాయి. అసలే మేషరాశి. అందులోనూ విదేశాలకు, సాంప్రదాయ విరుద్ధ భావాలకు కారకుడైన రాహువుతో అదే రాశిలో కలవడం ఈ పరిస్థితిని మరింతగా పెంచుతుంది. వీటి ప్రభావం ఏడు రాశుల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇందులో మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీనం ఉన్నాయి. మొత్తం మీద వక్ర గురువు ప్రభావం ఈ ఏడు రాశుల మీద ఎలా ఉంటుందన్నది పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశిలోనే గురువు వక్రించడం వల్ల జీవనశైలిలో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సంప్రదాయ భావాల నుంచే కాదు, చివరికి దుస్తుల విషయంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో స్థిరపడాలన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. విలాస జీవితం గడపాలనే కోరిక కలుగుతుంది. ఇతరులతో పోల్చి చూసుకోవడం ఎక్కువవుతుంది. కొత్త మిత్రులు, కొత్త ఆలోచనలు, కొత్త భావాలతో జీవన శైలి కొద్ది కొద్దిగా మారిపోతుంది.
- మిథునం: లాభ స్థానంలో గురువు వక్రించడం వల్ల మంచి, చెడు విచక్షణ లేకుండా సంపాదించే అవకాశం కలుగుతుంది. విలువలు, ప్రమాణాల నుంచి దారి మళ్లే సూచనలు కూడా ఉన్నాయి. కులాంతర, మతాంతర ప్రేమలకు, వివాహాలకు కూడా ఆస్కారముంటుంది. కొత్త పరిచయాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆధ్మాత్మిక చింతనలో కూడా కొత్తదనం చోటు చేసుకుంటుంది. దాదాపు ప్రతి విషయంలోనూ ఆధునిక భావాలు సంతరించుకోవడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో గురువు వక్రిస్తున్నందువల్ల, వృత్తి, వ్యాపారాల తీరుతెన్నులను మార్చడం జరుగుతుంది. ఆధునిక పద్ధతులను అనుసరించే అవకాశం ఉంది. ఉద్యోగం విష యంలో కూడా టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభం అవుతుంది. కొత్త పరికరాలను జీవితం లోకి తీసుకు రావడం జరుగుతుంది. వేషధారణలో మార్పు వస్తుంది. జీవితం గురించి కొత్తగా ఆలోచించడం మొదలవుతుంది. గృహ, వాహన సౌకర్యాలు కూడా ఆధునికం అవుతాయి.
- సింహం: ఈ రాశివారికి నవమ స్థానంలో గురువు వక్రించడం జరుగుతోంది. ఫలితంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు బాగా మెరుగుపడడం జరుగుతుంది. విదేశాల నుంచి వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇక ఈ రాశివారి వ్యవహార శైలి, జీవనశైలిలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అలవాట్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తుల జాబితాలో చేరిపోవడం జరుగుతుంది.
- తుల: సప్తమ స్థానంలో గురువు వక్రగతి పట్టడం వల్ల విదేశీ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విలాసాల మీద, ఆధునిక సౌకర్యాల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధునిక శైలి అలవాట్లు ప్రారంభం కావడం జరుగుతుంది. వ్యస నాలకు అలవాటు పడే సూచనలున్నాయి. అనవసర పరిచయాలు పెంపొందే అవకాశం కూడా ఉంది. వృత్తి,వ్యాపారాల్లో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి లబ్ధి పొందడం కూడా జరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశివారి మీద గురువు వక్రగతి ప్రభావం మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశినాథుడైన గురువు వక్రించడం వల్ల ధనపరంగా పరిస్థితి మెరుగుపడడంతో పాటు ఆధునిక జీవన శైలి వంటబట్టే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఒకరు విదేశాల్లో స్థిరపడే అవ కాశం ఉంది. విదేశాలకు రాకపోకలుంటాయి. వృత్తి, వ్యాపారాలపరంగా విదేశాలతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న బంధువర్గంతో పెళ్లి సంబంధం కుదరవచ్చు.
- మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు వక్రించడం వల్ల ఆధ్యాత్మిక చింతనలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఆధునిక పద్ధతులకు అలవాటు పడడం జరుగుతుంది. జీవనశైలిలో సమూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ ఉద్యోగాల కోసం, విదేశాల్లో స్థిరపడడం కోసం ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది. ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త అలవాట్లకు దగ్గరవడం వంటివి జరుగుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.