Budha Gochar 2024: మేష రాశిలో బుధ సంచారం.. ఈ రాశుల వారికి శుభ యోగాలు పక్కా.. !
ఈ నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బుధుడు మేష రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఇరవై రోజుల కాలంలో బుధుడు ఆరు రాశులకు శుభ ఫలితాలనిస్తాడు. నిజానికి బుధుడికి మేష రాశి ఏమాత్రం అనుకూల రాశి కాదు. అయితే, బుధుడు ఇక్కడ రవి, శుక్ర గ్రహాలతో కలిసి ఉంటున్నందువల్ల బాగా అనుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.
ఈ నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బుధుడు మేష రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఇరవై రోజుల కాలంలో బుధుడు ఆరు రాశులకు శుభ ఫలితాలనిస్తాడు. నిజానికి బుధుడికి మేష రాశి ఏమాత్రం అనుకూల రాశి కాదు. అయితే, బుధుడు ఇక్కడ రవి, శుక్ర గ్రహాలతో కలిసి ఉంటున్నందువల్ల బాగా అనుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి మాత్రం ఈ మేష బుధుడి వల్ల కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధించడం, ఆదాయం బాగా వృద్ది చెందడం, ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం కావడం,. శుభవార్తలు వినడం వంటివి జరుగుతాయి.
- మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక ముఖ్యమైన విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆస్తి వివాదం, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడి, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మీ స్నేహాల నెట్ వర్క్ విస్తరిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అధికారులతో సమస్యలు పరిష్కారమై, సామరస్యం పెరుగుతుంది. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థికంగానూ, ఉద్యోగ పరం గానూ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. సామా జికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి.
- సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ సంచారం ప్రారంభం కావడం, పైగా రాశ్యధిపతి రవితో కలవడం వల్ల విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయాలు సాధిస్తారు. మంచి ఉద్యో గంలోకి మారడానికి అవకాశముంది. నిరుద్యోగులు అంచనాలకు మించిన ఉద్యోగంలో చేరే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు శీఘ్ర పురోగతి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది.
- తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు రాశ్యధిపతి శుక్రుడితో కలిసి సప్తమంలో సంచారం చేస్తు న్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. ఇంతకు ముందు సంపాదించిన ఆస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమై, జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లేదా వ్యాపార విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల్లో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా విస్తరిస్తాయి. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
- మీనం: ఈ రాశికి ధన స్థానంలో బుధ సంచారం అన్ని విధాలుగానూ యోగిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. పలుకుబడి పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. విహార యాత్రలు చేసే సూచనలున్నాయి. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి.