Horoscope Today: ఆ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి..12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 9, 2024): మేష రాశి వారు ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశించిన విధంగా సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి ఈ రోజంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి..12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 09th May 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 09, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మే 9, 2024): మేష రాశి వారు ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశించిన విధంగా సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి ఈ రోజంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశివారికి ప్రస్తుతం గురు, శుక్ర, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం ఆశించినవన్నీ నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశించిన విధంగా సఫలం అవుతుంది. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. వృత్తి, ఉద్యోగాలలో గౌరవాభిమానాలు పెరుగు తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశిలో గురువు సంచారం వల్ల కొన్ని కష్టనష్టాల నుంచి గట్టెక్కుతారు. రోజంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. ఆరోగ్య సమస్యలు బాగా తగ్గి ఉంటాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగపరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదా నంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. వృథా ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు, లాభ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నందు వల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థిక పరిస్థితుల కూడా చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాల విషయంలో సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

లాభ స్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నందువల్ల ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు లాభదాయకంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో జీత భత్యాలు పెరిగే అవకాశముంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సప్తమ స్థానంలో తిష్ఠ వేసి ఉన్న శనీశ్వరుడి కారణంగా రాజకీయంగా ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభ గ్రహాలైన గురు, శుక్రులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ వార్తలు వింటారు. ఆదాయపరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. వ్యాపారాలు రాబడికి లోటుండదు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

భాగ్య స్థానంలో గురువు, షష్ట స్థానంలో శనీశ్వరుడి కారణంగా అంచనాలకు మించిన ఆదాయ వృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. ఉద్యో గంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవు తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశినాథుడు శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కే అవ కాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం తీరిక ఉండదు. లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాఫీగా సాగిపోతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

గురు గ్రహం సప్తమ స్థానంలో ప్రవేశించి బాగా అనుకూలంగా మారినందువల్ల జీవితంలో సాను కూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుం టారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

తృతీయంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో శుక్రుడు కొండంత అండగా నిలబడతారు. కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగి పోతాయి. ఆదాయం పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2)

శుక్ర, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రవి, కుజుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. సర్వత్రా మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల వారికి మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగ జీవితం సీదా సాదాగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదిం చుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ధన స్థానంలో శుక్రుడు, సొంత రాశిలో కుజుడు ఉన్నందువల్ల అంచనాలకు మించిన ఆర్థిక పురో గతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భూ సంబంధమైన ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. ఉద్యోగంలో ఎదురులేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

Latest Articles
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..