Luxury Horoscope: ఆ రాశుల వారికి శుక్ర యోగం.. విందు, విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు..!
మేష రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల సాదారణంగా విలాస జీవితం అలవడుతుంది. విందులు విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ఈ నెల 19 వరకూ మేష రాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఆ తర్వాత తన స్వస్థానమైన వృషభ రాశిలో ప్రవేశించి అక్కడ ఓ నెల రోజులుంటాడు. వృషభ రాశిలో కూడా శుక్రుడు దాదాపు ఇటువంటి ఫలితాలనే ఇస్తాడు.
మేష రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల సాదారణంగా విలాస జీవితం అలవడుతుంది. విందులు విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ఈ నెల 19 వరకూ మేష రాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఆ తర్వాత తన స్వస్థానమైన వృషభ రాశిలో ప్రవేశించి అక్కడ ఓ నెల రోజులుంటాడు. వృషభ రాశిలో కూడా శుక్రుడు దాదాపు ఇటువంటి ఫలితాలనే ఇస్తాడు. ఈ రెండు రాశుల్లో శుక్ర సంచారం కారణంగా మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి విలాస జీవితం మీద ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో ఎక్కు వగా పాల్గొంటారు. జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవించాలనే అభిప్రాయం బలపడుతుంది.
- మేషం: ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల వీరికి విలాస జీవితం మీద వ్యామోహం పెరుగుతుంది. వ్యసనాల మీదకు మనసు మళ్లుతుంది. స్త్రీ వ్యామోహం కూడా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ధనం మీద కూడా మోజు పెరుగుతుంది. ఈ రాశివారు మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొనడానికి, విహార యాత్రలు చేయడానికి ఎక్కువగా ఖర్చు చేసే అవకాశముంది. దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు మెరుగుపడతాయి. ఎప్పటికప్పుడు కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడి వల్ల వీరు ఎక్కువగా ఇతర జెండర్లతో మాత్రమే స్నేహాలు చేయడం, వారితోనే ఎక్కువ సమయాన్ని గడపడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి కూడా అవకాశముంటుంది. సంపాదనలో ఎక్కువ భాగాన్ని విలాసాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడ తాయి. విహార యాత్రలకు, సుఖ సంతోషాలకు బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల సహోద్యోగులతో విందులు వినోదాల్లో పాల్గొనడం, వ్యసనాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం వంటివి జరిగే అవకాశముంటుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశాలు, సంపద కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల జీవనశైలిలో మార్పు చోటు చేసుకుంటుంది. విహార యాత్రలు, విలాసాలలో మునిగి తేలే అవకాశముంటుంది. ఇతర జెండర్లతో స్నేహాలు పెరుగుతాయి. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే సూచనలున్నాయి.
- తుల: ఈ రాశికి సప్తమంలో శుక్ర సంచారం వల్ల, శుక్రుడే ఈ రాశికి అధిపతి అయినందువల్ల స్త్రీ వ్యామో హం బాగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లోనూ, ఉద్యోగంలోనూ రాబడి బాగా పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. విందు వినోదాల మీద ఖర్చు పెరుగు తుంది. సంపన్నులతో స్నేహాలు పెరిగి, అటువంటి జీవితానికి అలవాటు పడే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో అంటే ఆలోచనా స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారి వ్యక్తిగత జీవితం చాలావరకు మారిపోయే అవకాశం ఉంటుంది. సుఖ సంతోషాలతో గడపడానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభం అవుతుంది. మనసులోని కోరికలన్నిటినీ నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. విలాస జీవితం మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరగడం, తానొక ప్రముఖుడుగా చెలామణీ కావడం వంటివి కూడా జరుగుతాయి. ఆధునిక జీవన శైలి అలవడుతుంది.
- మకరం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్ర సంచారం వల్ల సుఖాభిలాష బాగా పెరుగుతుంది. సుఖ సంతోషాలలో మునిగి తేలడానికి ప్రాధాన్యం ఇస్తారు. విందు వినోదాల మీద అతిగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు బాగా అవకాశముంది. విహార యాత్రలు పెరుగుతాయి. దాంపత్య జీవితాన్ని మెరుగుపరచుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. జీవనశైలిని బాగా మార్చుకోవడం, సంపన్న జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది.