Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
దిన ఫలాలు (మే 8, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొన్ని పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మే 8, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొన్ని పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొన్ని పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రోజంగా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆస్తి వ్యవహారం ఒకటి కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృ ప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు ఎక్కువవుతుంది. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు లాభి స్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి సాధిస్తాయి. ఉద్యోగంలో పని భారం బాగా తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవ హారాలు సానుకూలంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాలొంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపో తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాను కూలంగా కొనసాగుతాయి. ఒకరిద్దరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఇరుగు పొరు గుతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా పుంజుకుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి కానీ, ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండవచ్చు. ప్రతి పనీ నిదానంగా పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేపడతారు. కొందరు దగ్గర బంధువులతో ఇబ్బందులుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించం మంచిది. వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండడానికి ఇది సమయం కాదు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు మిత్రులతో వివాదాలు తప్పకపోవచ్చు. వ్యాపారాలు అభి వృద్ధి బాటపడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కొత్త నిర్ణ యాలు తీసుకుంటారు. దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఏ ప్రయత్నం అయినా సఫలం అవుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలపరంగా దూసుకుపోతారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం మరింతగా పెరుగుతుంది. తల్లితండ్రుల జోక్యంతా ఆస్తి సమస్య పరిష్కారమవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ఆరోగ్యానికి లోటుండదు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఒకరి ద్దరు బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. స్వల్పంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశిం చిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో మీ పట్ల అధికారుల వైఖరి మారుతుంది. వ్యక్తిగతంగా కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతారు. బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అద నపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ప్రయోజనం పొందుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. మీ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. బంధువులు, స్నేహితుల ద్వారా లాభపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికారులతో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టాలి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా కొనసాగుతుంది. మీ దగ్గర నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యాపారాలు నిల కడగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అనుకోకుండా ధన లాభం పొందుతారు. ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుం టారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు తప్పకుండా వసూలు అవుతాయి.