Astrology: జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉందా.. అయితే ఈ పరిహారాలు ట్రై చేయండి..
జాతకంలో గురువు బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి నిర్వహణ సామర్థ్యం బలహీనంగా మారుతుంది. చెడు సాంగత్యంలో చిక్కుకుంటాడు. ఆడపిల్లల జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే వారి దాంపత్యంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు సంతానం కలగదు.
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మొత్తం తొమ్మిది గ్రహాలు వ్యక్తుల జీవితాలపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తాయి. అన్ని గ్రహాలోకెల్లా దేవగురువు గురు గ్రహం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. వ్యక్తి జీవితంలో బృహస్పతి ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి తన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా దేవగురువు బృహస్పతి బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి చదువులో అనేక రకాల అడ్డంకులు ఏర్పడతాయి.
జాతకంలో గురువు బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి నిర్వహణ సామర్థ్యం బలహీనంగా మారుతుంది. చెడు సాంగత్యంలో చిక్కుకుంటాడు. ఆడపిల్లల జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే వారి దాంపత్యంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు సంతానం కలగదు.
మరోవైపు.. ఎవరి జాతకంలో బృహస్పతి బలమైన స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితి ఎదురైనా బలంగా ఉంటాడు.ఆ వ్యక్తిని గురుడు రాజుగా చేస్తాడు. దేవగురువు బృహస్పతి ధనుస్సు, మీన రాశులకు అధిపతి. కర్కాటక రాశిలో ఉన్నప్పుడు బృహస్పతి ఉత్తమ ఫలితాలను ఇస్తాడు. రాజయోగంతో ఆ వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాడు
శుభ సంకేతాలు వేద జ్యోతిష్యంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి అన్ని రకాల సుఖ సంతోషాలను పొందుతాడు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అన్ని చోట్ల గౌరవం, కీర్తి లభిస్తుంది. భగవంతుని విశేష అనుగ్రహం వల్ల ప్రతి పని చాలా సులభంగా పూర్తవుతుంది. ఎవరి జాతకంలో దేవగురువు బృహస్పతి కేంద్రంలో ఉంటాడో.. ఆ వ్యక్తి సమస్యలన్నీ వీలైనంత త్వరగా తీరతాయి.
అశుభ సంకేతాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరి జాతకంలో దేవగురువు బృహస్పతి బలహీనంగా ఉంటె.. ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు నష్టాలు కలుగుతాయి. తీసుకున్న ప్రతి నిర్ణయం తారుమారు అవుతాయి. బలహీనమైన నిర్ణయాలను తీసుకుంటారు. పెద్దలు, గురువుల సహకారం లభించదు. చదువుకు, డబ్బుకు సంబంధించి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. సంతానంతో ఇబ్బందులు పడతారు. సంతోషం ఉండదు. పెళ్లికాని యువతీయువకులు అనేక రకాల అడ్డంకులను ఎదుర్కొంటారు.
బృహస్పతిని బలపరిచేందుకు పరిహారాలు వేద జ్యోతిషశాస్త్రంలో, బృహస్పతి మొత్తం తొమ్మిది గ్రహాలకు గురువు. ఏ వ్యక్తి జీవితంలో గురువు శుభ దృష్టిని కలిగి ఉంటాడో.. అతను అన్ని రకాల సౌఖ్యాలను, గౌరవాన్ని పొందుతాడు. ఎవరి జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటుందో.. వారు గురు స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి కొన్ని నియమాలు, చర్యలు జ్యోతిషశాస్త్రంలో ఇవ్వబడ్డాయి. ఈ రోజు గురువును బలపరిచే మార్గాల గురించి తెలుసుకుందాం..
- జాతకంలో దేవగురువు బృహస్పతి బలపడాలంటే తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పసుపును నీటిలో కలిపి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
- బృహస్పతిని శుభప్రదంగా చేయడానికి శివుడిని పూజించి, పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయండి.
- గురువారం ఉపవాసం ఉండి, విష్ణువును పూజించండి. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించండి.
- మీ కంటే పెద్దవారిని గౌరవించండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)