Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్నిహితుల నుంచి అపనిందలు ఎదుర్కొంటారు.. 12 రాశులవారిపై అమావాస్య ప్రభావం ఇలా..

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక రాశిలో రవి, చంద్రుడు కలవడానికి అమావాస్య కింద పరిగణిస్తారు. మనసుకు కారకుడైన చంద్రుడు ఈ అమావాస్య రోజున పూర్తిగా క్షీణించడం వల్ల దీని ప్రభావం వివిధ రాశుల మీద తప్పకుండా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.

సన్నిహితుల నుంచి అపనిందలు ఎదుర్కొంటారు.. 12 రాశులవారిపై అమావాస్య ప్రభావం ఇలా..
Amavasya Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 16, 2023 | 6:46 PM

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక రాశిలో రవి, చంద్రుడు కలవడానికి అమావాస్య కింద పరిగణిస్తారు. మనసుకు కారకుడైన చంద్రుడు ఈ అమావాస్య రోజున పూర్తిగా క్షీణించడం వల్ల దీని ప్రభావం వివిధ రాశుల మీద తప్పకుండా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ నెల 19న వృషభ రాశిలో రవి చంద్రులు కలవడం వల్ల అమావాస్య ఏర్పడుతోంది. వివిధ రాశుల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుందో ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేష రాశి: ఈ రాశి వారికి రెండవ స్థానమైన వృషభ రాశిలో అమావాస్య చోటు చేసుకుంటున్న అందువల్ల ఆర్థికపరంగా కుటుంబ పరంగా కొన్ని నిర్ణయా లను ఆ రోజున తీసుకోకపోవడం మంచిది. అమావాస్య రోజున కొత్తగా ఏ పని ప్రారంభించి నప్పటికీ, ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. అంతకుముందు మొదలుపెట్టిన కార్యక్రమాలను, తీసుకున్న నిర్ణ యాలను కొనసాగించవచ్చు. ఆ రోజున ఎటు వంటి పరిస్థితులలోనూ ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోకపోవడం శ్రేయస్కరం. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేయటం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు.
  2. వృషభ రాశి: ఈ రాశి లోని అమావాస్య ఏర్పడుతున్నందువల్ల రోడ్డు ప్రమాదాల విషయంలోనూ, ఆహార, విహారాలలోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్త పరిచయాలు నష్టం కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు తీసుకు వస్తాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. ఆ రోజున రొటీన్ వ్యవహారా లతో సరిపట్టుకోవడం మంచిది. ఏదో ఒక దుర్వార్త తప్పకుండా చెవిన పడుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు అపనిందలు వేసే అవకాశం ఉంది.
  3. మిథున రాశి: ఈ రాశి వారిలో కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సాధారణంగా ఎక్కువగా ఉండే చొరవ దూకుడుతనం బాగా వెనుక పట్టు పడతాయి. ఉద్యోగం విషయంలో నిరాశ ఆవహిస్తుంది. వృత్తి వ్యాపార సంబంధమైన కార్యకలాపాలు బాగా మందగిస్తాయి. మన సంతా అలజడిగా, చికాకుగా ఉంటుంది. ఇత రులు తొందరగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆ రోజున కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం మంచిది.
  4. కర్కాటక రాశి: ఈ రాశి వారికి అమావాస్య రోజంతా కొద్దిగా మందకొడిగా ఉంటుంది. ఏ పని చేయ బుద్ధి కాదు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు భారంగా అనిపిస్తాయి. ఇతరులు మిమ్మల్ని స్వార్థానికి, స్వప్రయోజనాలకు ఉపయోగించు కుంటున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఎవరినీ ఒక పట్టాన నమ్మలేరు. ఆ రోజున ఆలయాల సందర్శన లేదా ఆధ్యాత్మిక గ్రంథాల పఠనమ్ వంటివి ఉపశమనం కలిగిస్తాయి. ఏదో ఒక సమస్య మీద పదేపదే ఆలోచించడం జరుగు తుంది. శారీరకంగా కూడా నిస్సత్తువ ఆవహి స్తుంది. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: సాధారణంగా అమావాస్య రోజున మనసంతా కొద్దిగా చికాకుగానే ఉంటుంది. తలపెట్టిన పనులు ఏవీ పూర్తికాక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా చేతికి అందవలసిన డబ్బు అందక పోవటం వల్ల మనసంతా చికాకుగా ఉంటుంది. ఆ రోజున ఎవరి నుంచి ఏదీ ఆశించకపోవడం మంచిది. ఉద్యోగంలో కూడా మానసిక ఒత్తిడి, పని భారం ఎక్కువగా ఉంటాయి. ఎవరితో ఏది మాట్లాడినా అది ఏదో ఒక వివాదానికి దారి తీస్తుంది. బంధువులతో కూడా అపార్ధాలు తలెత్తుతాయి. కుటుంబ పెద్దల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోజున అనేక విషయాలలో మౌనంగా ఉండటం శ్రేయస్కరం.
  7. కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ అమావాస్య వల్ల కొన్ని ఆంతరంగిక, వ్యక్తిగత విషయాలు ప్రయత్నాలు బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. తాను ఒకటి తల చిన దైవం మరొకటి తలచినట్టుగా రోజంతా తల కిందులుగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిజానికి ఆ రోజున విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగంలో పని భారం బాగా పెరిగి ఇబ్బంది పడతారు. అధికా రుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కుటుంబంలో కొద్దిపాటి కలతలు రేగే అవకాశం కూడా ఉంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయడం హామీలు ఉండటం మంచిది కాదు.
  8. తులా రాశి: ఈ రాశి వారు అమావాస్య రోజున ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇచ్చినా, డబ్బు తీసుకున్నా అది తప్పకుండా సమస్యలకు దారితీస్తుంది. ఆరోజున ఈ రాశి వారు కొత్తగా చికిత్సను ప్రారంభించడం కూడా మంచిది కాదు. కొత్త ప్రయత్నాలు తలపెట్టవద్దు. రొటీన్ వ్యవహారాలకు కట్టుబడి ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిది. డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పత్రాలను లేదా విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి వారు అమావాస్య రోజున జీవిత భాగ స్వామితోనూ ఇతర కుటుంబ సభ్యులతోనూ ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. నోరు జారి సమస్యలు కొనితెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కూడా ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది. ప్రతి వారితోనూ అంటి ముట్టనట్టు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేయడం శ్రేయస్కరం. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది.
  10. ధనుస్సు రాశి: అమావాస్య రోజున ఈ రాశి వారు శారీరకంగా కూడా కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అవసరానికి డబ్బు తీసుకున్న వారు అపనిందలు, అభాండాలు వేసే సూచనలు ఉన్నాయి. ఆ రోజున ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ అది తొందరపాటు నిర్ణయమే అవుతుంది. మానసిక ప్రశాంతత కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. ఆ రోజున విలువైన వస్తువులు కొనడం మంచిది కాదు. అసలు షాపింగ్ చేయడం కూడా శ్రేయస్కరం కాదు. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఎవరి సమస్యలలోను తల దూర్చవద్దు.
  11. మకర రాశి: అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ప్రయత్నాలు ప్రారంభించవద్దు. ఆలోచనలను కూడా ఎంత అదుపు చేసుకుంటే అంత మంచిది. ఇతరులకు సహాయం చేయటం గురించి ఆలోచించినప్పటికీ అది చివరకు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ కొన్ని ఊహించని చికాకులు తలెత్తే అవకాశం ఉంది. వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. వృత్తి వ్యాపారాలలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త లక్ష్యాలతో ఇబ్బంది పడవలసి వస్తుంది.
  12. కుంభ రాశి: ఈ రాశి వారికి ఇంటా బయటా విపరీతమైన ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. వాగ్దానాలు, హామీలు నెరవేర్చడానికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. మానసిక విశ్రాంతి దూరమై అలసి పోతారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం చాలా మంచిది. ఆహార విహారాలకు సంబంధిం చిన జాగ్రత్తలు కూడా పాటించడం చాలా అవ సరం. కుటుంబ పెద్దలలో ఒకరి ఆరోగ్యం ఆందో ళన కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు కూడా అసంపూర్తిగా మిగిలి పోవడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఎక్కువవుతుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి.
  13. మీన రాశి: ఈ రాశి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. డబ్బు గానీ, విలువైన వస్తువులు గానీ పోగొట్టు కునే ప్రమాదం ఉంది. కొత్త ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఆ రోజున ఎవరితోనైనా ఎంత తక్కు వగా మాట్లాడితే అంత మంచిది. రొటీన్ కు భిన్నంగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం విష యంలో మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. ఎంత సన్నిహితులైనప్పటికీ మీ వ్యక్తిగత విషయాలు వెల్లడించవద్దు. కొందరు మిత్రుల ద్వారా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆ రోజున ప్రేమ వ్యవహారాలకు కూడా దూరంగా ఉండటం చాలా మంచిది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..