AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: వైసీపీ 5వ జాబితాలో ఈ 12 మందికి ఎంపీగా చోటు దక్కనుందా..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ప్రత్యర్థి పార్టీలు అధికారపార్టీపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. వాటికి కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఇదిలా ఉంటే మొన్నటి వరకు నాలుగు జాబితాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది వైసీపీ. అయితే సోమవారం పూర్తిస్థాయిలో ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్దమయ్యారు సీఎం జగన్.

AP Politics: వైసీపీ 5వ జాబితాలో ఈ 12 మందికి ఎంపీగా చోటు దక్కనుందా..?
Ap Ysrcp
Srikar T
|

Updated on: Jan 27, 2024 | 11:47 AM

Share

విజయవాడ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ప్రత్యర్థి పార్టీలు అధికారపార్టీపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. వాటికి కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఇదిలా ఉంటే మొన్నటి వరకు నాలుగు జాబితాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది వైసీపీ. అయితే సోమవారం పూర్తిస్థాయిలో ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్దమయ్యారు సీఎం జగన్. ఇదిలా ఉంటే సోమవారం ప్రకటించే జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్న ఉత్కంఠ ఆశావాహుల్లో ఎక్కువగా ఉంది. 12 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారి పేర్లు ఇప్పుడు చూద్దాం.

  • విజయనగరం – మజ్జి శ్రీనివాస్
  • అనకాపల్లి – గుడివాడ అమర్నాథ్.
  • కాకినాడ – చలమల శెట్టి సునీల్
  • రాజ‌మండ్రి – గూడూరు శ్రీనివాస్ / పద్మలత.
  • అమలాపురం – ఉన్నమట్ల ఎలిజా
  • న‌ర‌సాపురం – గోక‌రాజు గంగ‌రాజు / శ్యామ‌లా దేవి
  • గుంటూరు… కావటి మనోహర్ / ఉమ్మారెడ్డి వెంకట రమణ
  • నరసరావుపేట – అనిల్ కుమార్ యాదవ్
  • క‌ర్నూలు – బీవై రామ‌య్య,
  • నంద్యాల – ఖాద‌ర్ బాషా / అలీ
  • ఒంగోలు – మాగుంట‌ శ్రీనివాసులు రెడ్డి లేదా కొత్త వారు
  • నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఇదిలా ఉంటే తెలుగుదేశం కూడా జనసేనతో పొత్తులో భాగంగా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు రెండు నెలల ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తూ ఒకరినొకరు మాటల దాడి కొనసాగించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..