AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: భిన్నమైన సభ.. లీడర్‌ విత్‌ కేడర్‌.. జగన్ ఎన్నికల శంఖారావం

అది సాధారణ సభ కాదు. వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్‌ మమేకమయ్యే అతి పెద్ద వేదిక. కేడర్‌తో లీడర్‌ మాట్లాడతారు. తన మనసులో మాటను చెబుతారు. వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుంటారు. తన పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తారు. విపక్షాల దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలో కేడర్‌కు చెబుతారు. ఎన్నికల యుద్ధానికి లీడర్‌ సిద్ధం. కేడర్‌ సంసిద్ధం. యస్‌. ఏపీలో వైసీపీకి ఊపు తెప్పించి, కేడర్‌లో జోష్‌ నింపే భారీ బహిరంగ సభలు...భీమిలితో స్టార్ట్‌ అవుతున్నాయి. "సిద్ధం" అంటున్న జగన్‌కు కోరస్‌ కలపనుంది కేడర్‌.

YSRCP: భిన్నమైన సభ.. లీడర్‌ విత్‌ కేడర్‌.. జగన్ ఎన్నికల శంఖారావం
Ysr Congress Party
Ram Naramaneni
|

Updated on: Jan 26, 2024 | 10:00 PM

Share

అటు వైపు సముద్రం…ఇటువైపు జన సముద్రం. భీమిలి నియోజకవర్గం సంగివలసలో వైసీపీ ఏర్పాటు చేసిన అతి భారీ వేదిక ఇది. గత మీటింగులకు భిన్నమైన “సిద్ధం” సభ. ఇది కేవలం సభా వేదిక మాత్రమే కాదు…బిగ్ ర్యాంప్‌పై నుంచి సీఎం జగన్‌ నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి అందరిని పలకరించి మాట్లాడతారు. వాళ్లతో మమేకమవుతారు. కేడర్‌ అభిప్రాయాలను ఆయన స్వయంగా తెలుసుకుంటారు. తన పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి కార్యకర్తలకు సీఎం స్వయంగా చెబుతారు. అంతేకాకుండా విపక్షాల దుష్ర్పచారాలను ఎలా తిప్పి కొట్టాలో కేడర్‌కు జగన్‌ చెబుతారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి…రాబోయే ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం చేయడమే ఈ సిద్ధం సభ లక్ష్యం.

ఏపీలో ఎన్నికల సమరానికి ఎత్తర జెండా అంటూ సిద్ధం అయింది అధికార వైసీపీ. “సిద్దం” పేరుతో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. భీమిలి నియోజకవర్గం సంగివలసలో లీడర్‌ విత్‌ కేడర్‌ మీటింగ్‌ వేదిక ఇది. ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర నుంచి నాలుగు లక్షల మంది కార్యకర్తలు హాజరు కానున్నారు. ఓవైపు జన సేన – టీడీపీ పొత్తు…స్పీడు బ్రేకర్లు, సీటు బ్రేకర్లు తగిలి కుదుపులకు లోనైన నేపథ్యంలో వైసీపీ సభపై ఏపీ మొత్తం దృష్టి సారించిందంటున్నారు విశ్లేషకులు.

రెండోసారి అధికారం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉన్న సీఎం జగన్‌…పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది జగన్‌ సర్కార్‌. అదేస‌మ‌యంలో గ‌త ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మ‌ధ్య తేడా చూడాలంటూ ప్రజలను కోరుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 28 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తమ పట్టు నిలుపుకోవాలని ప‌క్కా ప్లాన్‌తో అధికార పార్టీ ముందుకు వెళ్తోంది.

ఇక సిద్ధం పేరుతో అత్యంత భారీ స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 4 రీజనల్‌ కేడర్‌ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది వైసీపీ. దీనిలో భాగంగా భీమిలిలో తొలి సమావేశం జరుగుతోంది. ఇక ఈ నెల 30న ఏలూరులో జరగనున్న వైసీపీ ప్రాంతీయ సదస్సుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కార్యకర్తలు తరలి వెళ్లనున్నారు. ఇలా మొత్తం మీద కేడర్‌తో నాలుగు సభలు నిర్వహించి…వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాల‌నే అంశంపై పార్టీ కేడర్ కు జగన్ దిశానిర్దేశం చేస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలు విజయవంతం
ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలు విజయవంతం
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..