SEB Raids: అక్రమ మద్యం దాచేందుకు జిత్తులు.. అధికారుల దాడితో అసలు వ్యవహారం బట్టబయలు
అనకాపల్లిలోని ఓ ఇంటికితాళం వేసి ఉంది. పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఒక్కసారిగా అక్కడికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, ఎవరు ఉంటున్నారని ఇరుగు పొరుగు వారిని ఆరా తీశారు. స్థానికులు ఎవరూ నోరెత్తలేదు. దీంతో ఇక సచివాలయం సిబ్బందికి సమాచారం అందించారు వచ్చిన అధికారులు. వెంటనే తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అంతే ఒక్కసారిగా అక్కడ కనిపించ దృశ్యంతో అధికారులు షాక్ అయ్యారు.

అనకాపల్లి టౌన్ మిరియాల కాలనీలో ఒక ఇంట్లో భారీగా మద్యం నిల్వ ఉందని సమాచారంతో స్పెషల్ ఎంఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటికి తాళం వేసి వుండడంతో అనుమానించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ ను పిలిపించి, వారి సమక్షంలో తాళం పగలగొట్టి లోపలకు వెళ్లారు. దీంతో అనధికారికంగా మద్యం నిల్వ ఉంచినట్టు గుర్తించి లెక్కకట్టారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 909 మద్యం బాటిళ్ళు బయటపడ్డాయి. బాటిళ్ళపై ఉన్న ఎంఆర్పీ ధరల ఆధారంగా విలువ లక్ష 75 వేల రెండు వందల రూపాయలుగా తేల్చారు. మద్యం బాటిళ్ళను సీజ్ చేసి స్పెషల్ ఎంఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యాలయానికి తరలించారు.
ఇక్కడ దొరికిందంతా ప్రభుత్వ దుకాణాల్లో లభించే మద్యం కావడంతో మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు. అంత భారీగా మద్యం ఎవరు తీసుకొచ్చారు అన్న దానిపైన ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. మద్యం బాటిళ్ళపై ఉండే కోడ్ ఆధారంగా అవి ఏ షాపు నుండి వచ్చాయి..? ఎవరు తెచ్చారు..? ఆ ఇంట్లో ఎవరు స్టోర్ చేశారు..? అన్న కోణంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని స్పెషల్ ఎంఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్స్‌పెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…