Cyber Crime: గూగుల్ మ్యాప్స్‌కు రేటింగ్ ఇస్తే చాలు.. లక్షల్లో లాభాలు.. తీరా చూస్తే ఉన్నదంతా స్వాహా!
టెక్నాలజీ పెరిగే కొద్దీ జనాన్ని మోసం చేసేందుకు కొత్త కొత్త మార్గాలను క్రియేట్ చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. ఎలాంటి కష్టం లేకుండానే ఈజీగా కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. జనం డబ్బు దోచుకునేందుకు ఏకంగా సహాయకులను నియమించుకున్నారు సైబర్ నేరగాళ్లు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ జనాన్ని మోసం చేసేందుకు కొత్త కొత్త మార్గాలను క్రియేట్ చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. ఎలాంటి కష్టం లేకుండానే ఈజీగా కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. జనం డబ్బు దోచుకునేందుకు ఏకంగా సహాయకులను నియమించుకున్నారు సైబర్ నేరగాళ్లు. వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి ఇస్తే చాలు కమిషన్ల ఆశ చూపి బాధితుల నుండి డబ్బులు కాజేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నమోదైన ఒక సైబర్ క్రైమ్ కేసును చేధించే పనిలో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఎక్కడో విదేశాల్లో ఉంటూ మన ఖాతాలోని డబ్బులు మొత్తం కాజేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. అయితే అలాంటి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు తెరవడం ఒక సమస్య. ఆ సమస్యను అధిగమించేందుకు స్థానికంగానే ఉండే బ్రోకర్లను కమిషన్ల రూపంలో నియమించుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతాలు తెరిచి ఇస్తే చాలు తమకు కమిషన్ ఇస్తామంటూ చెప్పటంతో కొంతమంది దానికి ఒప్పుకుంటుంటూ కేటుగాళ్ళ ఉచ్చులో బిగుసుకుంటున్నారు. ఇదే తరహాలో బేగంపేట్ కు చెందిన వెంకటేష్, మల్కాజ్‌గిరికి చెందిన విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు బ్యాంక్ అకౌంట్‌లు ఓపెన్ చేసి పోలీసులకు దొరికిపోయారు.
గూగుల్ మ్యాప్ కి రేటింగ్ పేరుతో టాస్కులు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు. ఒక్క వాట్సాప్ మెసేజ్ తో ఈజీ మనీ అంటూ ప్రమోషన్లు చేసుకుంటారు. దీని నమ్ముతున్న అమాయకులు మాయ ఉచ్చులో చిక్కుకుని తేరుకునే లోపే సైబర్ నేరం జరిగిపోతుంది. గూగుల్ మ్యాప్స్‌కు రేటింగ్ పేరుతో టాస్కులు ఇచ్చి అమాయకులను ఫైబర్ నేరగాళ్ళు.. ముందు లాభాలు ఆశ చూపి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఇదే తరహా మోసాన్ని అనేక రాష్ట్రాల్లో అవలంబిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. అయితే కొట్టేసిన డబ్బు మొత్తాన్ని పలు బ్యాంక్ ఖాతాలకు సైబర్ నేరగాళ్లు మళ్ళిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాధ్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవల బోయిన్‌పల్లికి చెందిన ఒక బాధితుల నుండి గూగుల్ మ్యాప్స్ రేటింగ్ పేరుతో 7.15 లక్షల రూపాయల నగదును కాజేసారు..వీరికి సహకరించిన ఇద్దరు నిందితులను పోలీసుల అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులపై దేశవ్యాప్తంగా 104 కేసులతోపాటు తెలంగాణలో 13 కేసులో ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు 3 కోట్ల రూపాయలు కాజేసినట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…